Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా?

Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme | మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేసి రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ (Monthly Pension) పొందాలనుకుంటున్నారా? ఈ స్కీమ్‌లో డబ్బులు పొదుపు చేస్తే మీరు ప్రతీ నెలా రూ.1,78,000 వరకు పెన్షన్ పొందొచ్చు.

  • Share this:
రిటైర్‌మెంట్ తరువాత మెరుగైన ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుంది నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్టమ్ స్కీమ్‌(NPS). ఇది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ (Retirement Benefit Scheme). రిటైర్‌మెంట్ త‌ర్వాత ఎన్‌పీఎస్ ఖాతాదారుల‌కు రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ అందించేందుకు దీన్ని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం మద్ద‌తు కూడా ల‌భిస్తుంది. ఈ స్కీమ్‌లో భాగంగా సిస్ట‌మాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్‌ని (SWP) ఎన్‌పీఎస్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఎంచుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఈ ఆప్షన్‌ ద్వారా నెల‌కు క‌నీసం రూ.12 వేలు డిపాజిట్ చేసినా.. రిటైర్మెంట్ తర్వాత నెల‌కు క‌నీసం రూ.1.78 ల‌క్ష‌ల వ‌ర‌కు పెన్షన్ పొందే అవకాశం ఉంది.

Credit Report: మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఎందుకో ఇలా తెలుసుకోండి

"ఎన్‌పీఎస్ ఖాతాదారుడు 75 శాతం వ‌ర‌కు త‌న అకౌంట్‌లో ఈక్విటీని ఎంచుకోవ‌చ్చు. కానీ.. ఈక్విటీ ఎక్స్‌పోజర్ అనేది 60 శాతం ఉండి.. డెట్ ఎక్స్‌పోజ‌ర్ 40 శాతం ఉండాలి. దాని వ‌ల్ల రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. 60:40 ఈక్విటీ, డెట్ ఎక్స్‌పోజ‌ర్ వ‌ల్ల ఎన్‌పీఎస్ అకౌంట్ హోల్డ‌ర్ల‌కు దీర్ఘ‌కాలంలో 10 శాతం వ‌ర‌కు అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది.." అని సెబీ రిజిస్ట‌ర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌ప‌ర్ట్ జితేంద్ర సోలంకి అభిప్రాయ‌ప‌డ్డారు.

IRCTC Tirupati Tour: ఫ్లైట్‌లో తిరుపతి టూర్... దర్శనం టికెట్లు కూడా... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

"ఒక ఇన్వెస్ట‌ర్ నెల‌కు 12 వేల రూపాయ‌లు ఎన్‌పీఎస్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 30 ఏళ్ల‌లో 60:40 రేషియో ప్ర‌కారం ఎక్స్‌పోజ‌ర్ చేస్తే.. 30 ఏళ్ల త‌ర్వాత రూ.1,64,11,142 అమౌంట్ అందుతుంది. నెల‌కు రూ.54,704 పెన్ష‌న్ అందుతుంది. దానిపై సంవ‌త్స‌రానికి 6 శాతం వ‌డ్డీ కూడా ల‌భిస్తుంది.." అని సోలంకి అన్నారు.

Business Ideas: జాబ్ చేయకుండా డబ్బు సంపాదించాలా? ఈ 8 ఐడియాలు మీకోసమే

25 ఏళ్ల‌లో 8 శాతం రిట‌ర్న్‌తో రూ.1.36 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్ర‌తి నెల రూ.1,02,464 అమౌంట్ 25 ఏళ్ల వ‌ర‌కు పొందే అవ‌కాశం కూడా ఉంటుంది. ఒక‌వేళ ఎన్‌పీఎస్ ఖాతాదారుడు యాన్యుటీ ఎక్స్‌పోజ‌ర్‌ను 40 శాతానికి తీసుకుంటే భ‌విష్య‌త్తులో విత్‌డ్రాయ‌ల్ అమౌంట్ రూ.1.64 కోట్లు అవుతుంది. ఒక‌వేళ అదే 1.64 కోట్ల‌ను ఎస్‌డ‌బ్ల్యూపీలో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ప్ర‌తి నెల రూ.1.23 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే ఎక్కువ పొందొచ్చు. అది కూడా ఎస్‌డ‌బ్ల్యూపీ రిట‌ర్న్ 8 శాతం ఉంటే నెల‌కు 1.23 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం పొందొచ్చు. ఒక‌వేళ 50:50 రేషియోతో నెల‌కు రూ. 12 వేలు ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్ల త‌ర్వాత నెల‌కు రూ.1.70 ల‌క్ష‌లు పొందొచ్చు. రూ.68,330 యాన్యుటీ రిట‌ర్న్‌, ఎస్‌డబ్ల్యూపీ నుంచి రూ.1.02 ల‌క్ష‌లు పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published: