Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా

Pradhan Mantri MUDRA Yojana-PMMY | ఎలాంటి గ్యారెంటీ, ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఆఫర్ చేయడం ముద్ర స్కీమ్ ప్రత్యేకత. వ్యాపారులు చేసుకునేవారికి ముద్ర రుణాలు బాగా ఉపయోగపడతాయి.

news18-telugu
Updated: May 29, 2019, 11:58 AM IST
Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా
Business Loan: ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల లోన్... పొందండి ఇలా
  • Share this:
మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెట్టుబడికి కావాల్సినంత డబ్బు లేదా? అప్పు చేయాలంటే ష్యూరిటీ లేదా గ్యారెంటీ అడుగుతున్నారా? వ్యాపారానికి డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కావట్లేదా? మీలాంటి వారికోసమే కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్స్ ఆఫర్ చేస్తోంది. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్‌నే MUDRA అని పిలుస్తారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముద్ర రుణాలను అందిస్తాయి. 2015లో ప్రారంభమైన పథకం ఇది. ఎలాంటి గ్యారెంటీ, ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఆఫర్ చేయడం ముద్ర స్కీమ్ ప్రత్యేకత. వ్యాపారులు చేసుకునేవారికి ముద్ర రుణాలు బాగా ఉపయోగపడతాయి. ప్రధాన మంత్రి ముద్ర యోజనలో శిశు, కిషోర్, తరుణ్ పేరుతో మూడు రకాల రుణాలు ఉన్నాయి. రూ.50,000 వరకు శిశు రుణాలు, రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కిషోర్, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తరుణ్ కేటగిరీ కింద రుణాలు ఇస్తాయి బ్యాంకులు. బ్యాంకులు ఎక్కువగా శిశు కేటగిరీకే ప్రాధాన్యత ఇస్తాయి.

Pradhan Mantri MUDRA Yojana, PMMY, mudra loan, mudra loan eligibility, mudra loan interest rate, mudra loan interest calculator, mudra loan documents, mudra loan subsidy, Business Idea, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ముద్ర లోన్, ముద్ర రుణాలు, ముద్ర రుణాలు వడ్డీ, ముద్ర లోన్ సబ్సిడీ, బిజినెస్ ఐడియా
image: mudra.org.in


ముద్ర రుణాలు ఎవరెవరికి ఇస్తారు?


ఉద్యోగ కల్పనతో పాటు ఆదాయాన్ని పెంచడమే ముద్ర రుణాల లక్ష్యం. చిరు వ్యాపారులు, దుకాణాలు నిర్వహించేవారు, సేవా రంగంలో ఉన్నవారు ముద్ర రుణాలు తీసుకోవచ్చు. మైక్రో యూనిట్స్‌కు ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లభిస్తుంది. పాటు ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ లోన్స్ పొందొచ్చు. ఆటోలు, ఇ-రిక్షా, ప్యాసింజర్ కార్స్, ట్యాక్సీల కొనుగోలుకు ముద్ర రుణాలు తీసుకోవచ్చు. సెలూన్స్, బ్యూటీ పార్లర్స్, జిమ్, బొటిక్స్, టైలర్ షాప్స్, డ్రై క్లీనింగ్, సైకిల్, మోటర్ సైకిల్ రిపేర్ షాప్, డీటీపీ, ఫోటోకాపీయింగ్ ఫెసిలిటీస్, మెడికల్ షాప్స్, కొరియర్ సర్వీస్ నిర్వహించేవారు కూడా ముద్ర రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫుడ్ సెక్టార్‌లో పాపడ్, జామ్, స్వీట్స్, ఐస్ క్రీమ్, బిస్కిట్, బ్రెడ్ తయారుచేసేవాళ్లు కూడా, క్యాంటీన్స్ హోటల్స్ నిర్వహించేవారికి కూడా ముద్ర రుణాలు లభిస్తాయి. టెక్స్‌టైల్ రంగంలో హ్యాండ్‌లూమ్, పవర్ లూమ్, ఖాదీ, చికాన్, జరీ, జర్దోజీ, ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ వర్క్, డయింగ్, ప్రింటింగ్, అప్పారెల్ డిజైన్, కాటన్ జిన్నింగ్, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ లాంటి వ్యాపారాలకు కూడా ముద్ర రుణాలు వర్తిస్తాయి. ఇంకా ముద్ర రుణాలు ఏఏ వ్యాపారాలకు లభిస్తాయో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Pradhan Mantri MUDRA Yojana, PMMY, mudra loan, mudra loan eligibility, mudra loan interest rate, mudra loan interest calculator, mudra loan documents, mudra loan subsidy, Business Idea, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ముద్ర లోన్, ముద్ర రుణాలు, ముద్ర రుణాలు వడ్డీ, ముద్ర లోన్ సబ్సిడీ, బిజినెస్ ఐడియా
image: mudra.org.in


ముద్ర కార్డుల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందజేస్తారు. ముద్ర లోన్ మంజూరైన వారికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే బ్రాండింగ్‌తో రూపొందించిన ముద్ర కార్డు లభిస్తుంది. మంజూరైన రుణం లోన్ అకౌంట్‌లో ఉంటుంది. అవసరాన్ని బట్టి ముద్ర కార్డ్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.10 లక్షల వరకు గ్యారెంటీ అవసరం లేదు. ఐదేళ్లలో రుణాలను తీర్చేయొచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రూ.3 లక్షల కోట్ల ముద్ర రుణాలు అందజేస్తారని అంచనా. 2019 మార్చి నాటికి సుమారు 5 కోట్ల మంది రూ.2.82 లక్షల కోట్ల ముద్ర రుణాలు తీసుకున్నారని అంచనా.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో
ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...
Published by: Santhosh Kumar S
First published: May 29, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading