Mutual Fund: ఇండియాలో ఎక్కువ మంది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మ్యూచువల్ ఫండ్స్‌ను(Mutual funds) భావిస్తారు. సులువుగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్, విత్‌డ్రాలో ఫ్లెక్సిబిలిటీనే అందుకు కారణం. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి(Mutual fund investments) ఓ ఇంపార్టెంట్ అప్‌డేట్ ఉంది. ఫండ్ ఇన్వెస్టర్‌లు మార్చి 31లోపు నామినీ వివరాలను తప్పనిసరిగా అందించాలి. నామినీ అవసరం లేదనుకుంటే, డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయాలి. లేదంటే మ్యూచువల్ ఫండ్ పోర్టిఫోలియో లాక్ అవుతుంది. తద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.
* మార్చి 31 గడువు
2022 జూన్ 15న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఓ సర్క్యులర్ విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రైబర్లు నామినేషన్ వివరాలను సమర్పించాలని ఈ సర్క్యులర్ స్పష్టం చేసింది. లేదా 2022 ఆగస్టు 1 లోగా నామినేషన్ నుంచి తొలగించాలనుకుంటే డిక్లరేషన్‌ను సమర్పించాలని ప్రకటించింది. ఆ తర్వాత ఈ గడువును 2022 అక్టోబర్ 1కి పొడిగించారు. ప్రస్తుతం జాయింట్ అకౌంట్ సహా ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలన్నింటికీ గడువు 2023 మార్చి 31గా పేర్కొన్నారు. ఆలోగా ప్రాసెస్ కంప్లీట్ చేయని వారి ఫోలియోలు బ్లాక్ అవుతాయి. డెబిట్ చేసుకునే అవకాశం ఉండదు.
2021లో కొత్త ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్‌లను ఓపెన్ చేస్తున్న పెట్టుబడిదారులకు సెబీ ఇదే విధమైన ఆప్షన్ అందించింది. ప్రస్తుతం 42 మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు సుమారు రూ.40 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నాయి.
* ఎలా సబ్మిట్ చేయాలంటే?
కొత్త విధానంలో భాగంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు(AMC) యూనిట్ హోల్డర్‌లకు వారి ప్రాధాన్యతను బట్టి ఫిజికల్ లేదా ఆన్‌లైన్ ఫారంలో నామినేషన్ నుంచి వైదొలగడానికి నామినేషన్ ఫారం లేదా డిక్లరేషన్ ఫారంను సబ్మిట్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. ఫిజికల్ ఆప్షన్ విషయంలో, ఫారంలపై యూనిట్ హోల్డర్లందరి వెట్ సిగ్నేచర్ ఉంటుంది. ఆన్‌లైన్ ఆప్షన్‌లో అయితే, ఫారంపై యూనిట్ హోల్డర్‌ల ఇ-సైన్ ఉంటుంది.
ఇ-సైన్ సదుపాయాన్ని అందించడానికి తగిన యంత్రాంగాలు అమలులో ఉన్నాయని AMCలు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి. క్లయింట్ రికార్డుల ప్రైవసీ, సెక్యూరిటీని నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి. అన్ని సెక్యూరిటీల మార్కెట్ పార్టిసిపెంట్‌లు అమలు చేసే విధానంలో యూనిఫార్మిటీ తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.
Tax Guide: ట్యాక్స్ రిటర్న్‌లో పెన్షన్ ఇన్‌కమ్ ఎలా పేర్కొనాలి? పెన్షన్‌పై ట్యాక్స్ రూల్స్ ఇవే..
TBNG క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ బిరానీ CNBC-TV18తో మాట్లాడుతూ.. ‘ఆగస్టు నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ విషయంలో ఒకే విధమైన ప్రాసెస్ తీసుకురావడానికి SEBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో ఆగస్టు 1 నుంచి కొత్త పెట్టుబడిదారులకు నామినేషన్ అందించడానికి లేదా డిక్లరేషన్ ద్వారా మార్పులు చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులు 2023 మార్చి 31కి లోగా, నామినీని జోడించాలి లేదా నామినేషన్ నుంచి తొలగించాలి. నామినేషన్ ప్రాసెస్‌ను పెట్టుబడిదారులందరూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investments, Mutual Funds