దేశంలో డిజిటల్ పేమెంట్స్ శరవేగంగా పెరుగుతున్నాయి. క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండటం, రివార్డు పాయింట్లు లభిస్తుండటంతో ప్రజలు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, కార్డులు, ఏటీఎం టూ ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఊపందుకున్నాయి. అయితే, ఇదే సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువయ్యాయి. కస్టమర్ల అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. కానీ. బెనిఫిషరీ అకౌంట్‌కు మాత్రం అమౌంట్ యాడ్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సమయం తర్వాత ఆ అమౌంట్ తిరిగి కస్టమర్ అకౌంట్లో యాడ్ కావాల్సి ఉంటుంది. అయితే, కొందరికి క్షణాల్లో అమౌంట్ రీఫండ్ అవుతున్నా.. మరికొందరికి మాత్రం ఆలస్యంగా రీఫండ్ అవుతుంది. దీంతో, ఈ సమస్యపై కస్టమర్ల నుంచి ఆర్బీఐకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే 2019 సెప్టెంబర్ 19న ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది.
Airtel Plans: ఐపీఎల్ మ్యాచ్ చూడాలా? ఈ ఎయిర్టెల్ ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ
IRCTC Tour: 11 రోజుల టూర్‌కు కేవలం రూ.10,400 మాత్రమే... ఐఆర్సీటీసీ ఉత్తర భారతదేశ యాత్ర వివరాలివే
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కస్టమర్ పంపిన అమౌంట్ రీఫండ్ కాకపోతే సంబంధిత బ్యాంకులు ఆ కస్టమర్లకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు, ప్రారంభం కారణంగా మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అన్ని బ్యాంకులు తమ ఆఫ్‌లైన్ కార్యకలాపాలను మూసివేశాయి. అయితే, ఆన్లైన్ సర్వీసులను అందించినప్పటికీ మనీ ట్రాన్ఫర్ చేయడంలో కస్టమర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో చాలా మందికి ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్ అయ్యాయి. దీంతో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎన్పీసీఐ వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. “మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఏప్రిల్1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు మామూలుగానే డౌన్ అవుతాయి. అందువల్ల, అనేక మంది వినియోగదారులు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందేమీ లేదు. కాబట్టి, వినియోగదారులు ఆయా సేవలను నిరంతరాయంగా పొందవచ్చు. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయిన కస్టమర్లు వెంటనే రీఫండ్ పొందుతారు. లేని పక్షంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆయా బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.”అని వివరించింది.
SBI offer: ఎస్బీఐ అకౌంట్ ఉందా? ఈ 5 ఆఫర్స్ పొందడానికి ఇంకొన్ని గంటలే గడువు
కాగా, అవతలి వ్యక్తి నగదు పంపే క్రమంలో మీ బ్యాంకు అకౌంట్ నుంచి నగదు డెబిట్ అయినా సరే, అవతలి వ్యక్తి అకౌంట్లోకి క్రెడిట్ అవ్వని పక్షంలో ఒక రోజు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఆ లోపు మీ అకౌంట్లో కానీ, అవతలి వ్యక్తి అకౌంట్లో కానీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఆ విధంగా క్రెడిట్ కాకపోతే.. ట్రాన్సాక్షన్ జరిగి ఒక రోజు ముగిసిన తర్వాత రోజు నుంచి నగదు క్రెడిట్ అయ్యే వరకు రోజుకు రూ.100 చొప్పున సంబంధిత బ్యాంకు మీకు నష్టపరిహారం కింద రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తాయి. ఒకవేళ, నెల రోజులు దాటినప్పటికీ, మీ అమౌంట్ రీఫండ్ కాని పక్షంలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, BHIM UPI, Google pay, Money Transfer, Paytm, Personal Finance, PhonePe, UPI