Home /News /business /

GET OVER RS 2 CRORE RETURNS BY SAVING JUST RS 3500 PER MONTH IN SYSTEMATIC INVESTMENT PLAN SS

Rs 2 Crore Returns: రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు... నెలకు రూ.3,500 పొదుపు చేస్తే చాలు

Rs 2 Crore Returns: రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు... నెలకు రూ.3,500 పొదుపు చేస్తే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Rs 2 Crore Returns: రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు... నెలకు రూ.3,500 పొదుపు చేస్తే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Rs 2 Crore Returns | మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్ వస్తాయని చెబుతుంటారు. అయితే దీర్ఘకాలం పొదుపు చేస్తేనే ఈ రిటర్న్స్ పొందొచ్చు. మరి రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు కావాలంటే పొదుపును ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    జీతం రాగానే కొంత మొత్తం పొదుపు చేయాలని అనుకుంటున్నారా? ఇలాగే ప్రతీ నెల కాస్త పొదుపు చేసి భవిష్యత్తు కోసం సంపద కూడబెట్టాలనుకుంటున్నారా? కోట్ల రూపాయల సంపద కోసం లక్షల రూపాయలతో పొదుపు చేయాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం రూ.3,500 పొదుపు చేసినా మీ రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు కూడబెట్టొచ్చు. ఇందుకోసం మీరు సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రతీ నెలా క్రమం తప్పకుండా రూ.3,500 చొప్పున జమ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతీ నెలా కొంత పొదుపుచేసినా రూ.2 కోట్ల పైనే రిటర్న్స్ వస్తాయి. మరి ఏ పద్ధతిలో జమ చేస్తే రూ.2 కోట్ల రిటర్న్స్ పొందొచ్చో తెలుసుకోండి.

    సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ ఏటా 12 నుంచి 18 శాతం వరకు రిటర్న్స్ ఇస్తుంటాయి. కనీసం ఏటా 15 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి. ఆ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.3,500 చొప్పున జమ చేయాలి. 30 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తి ఇప్పుడు పొదుపు చేయడం మొదలుపెట్టినా రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు పొందొచ్చు. ఏటా 15 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో 30 ఏళ్లలో రూ.2 కోట్లు పొందాలనుకుంటే రూ.3,593 జమ చేయాలి. మనీకంట్రోల్ సిప్ క్యాలిక్యులేటర్ ద్వారా వచ్చిన లెక్క ఇది. ఆ లెక్క ఇక్కడ చూడొచ్చు.

    Salary Bonus: ప్లీజ్ జాబ్ మానెయ్యొద్దు... ఉద్యోగులకు కోటి రూపాయల బోనస్ ఇచ్చిన కంపెనీ

    how to start sip investment, how to start stp in mutual fund, sip calculator, sip example, sip example in mutual fund, sip mutual fund calculator, Systematic Investment Plan, కోటీశ్వరులు కావడం ఎలా, డబ్బు పొదుపు చేయడం ఎలా, మనీ సేవింగ్ టిప్స్, మ్యూచువల్ ఫండ్
    (Source: Moneycontrol SIP Calculator)


    అంటే 15 శాతం రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో నెలకు రూ.3,593 చొప్పున 30 ఏళ్లు పొదుపు చేస్తే రూ.2 కోట్లు గ్యారెంటీగా రిటర్న్స్ పొందొచ్చు. కోటి రూపాయల రిటర్న్స్ కావాలంటే నెలకు రూ.1800 జమ చేయాలి. 15 శాతం రిటర్న్స్ చొప్పున చేసిన క్యాలిక్యులేషన్ ఇది. ఒకవేళ రిటర్న్స్ శాతం ఇంతకన్నా తక్కువగా ఉంటే రిటర్న్స్ తక్కువగా వస్తాయి.

    మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేముందు గతంలో ఆ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ చెక్ చేయాలి. ఆ రిటర్న్స్ ఆధారంగా భవిష్యత్తులో రిటర్న్స్‌ని అంచనా వేయొచ్చు. అంతే రిటర్న్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు. స్టాక్ మార్కెట్‌లో పరిస్థితులను బట్టి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పెరుగుతాయి లేదా తగ్గుతాయి.

    Save Money: ఇలా పొదుపు చేస్తే మీ కూతురు పెళ్లికి, పైచదువులకు రూ.50 లక్షలు

    మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహా తీసుకోవచ్చు. మీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫండ్ ఎంచుకొని పెట్టుబడిని ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుందన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mutual Funds, Personal Finance

    తదుపరి వార్తలు