Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్‌తో ఒక నెల కనెక్షన్ ఫ్రీ

Tata Sky Annual Flexi Plan | యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్‌ తీసుకోవాలంటే మీ టాటా స్కై అకౌంట్‌లో 12 నెలలకు సరిపడా బ్యాలెన్స్ ఉండాలి.

news18-telugu
Updated: July 2, 2019, 12:59 PM IST
Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్‌తో ఒక నెల కనెక్షన్ ఫ్రీ
Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్‌తో ఒక నెల కనెక్షన్ ఫ్రీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టాటా స్కై యూజర్లకు శుభవార్త. టాటా స్కై యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ తీసుకున్నవారికి ఒక నెల ఉచితంగా కనెక్షన్ అందిస్తోంది కంపెనీ. డీటీహెచ్ కంపెనీలతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సర్వీసుల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న టాటా స్కై... కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షిస్తోంది. కొంతకాలం క్రితం యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకున్నవారు 12 నెలల పాటు టాటా స్కై సేవలు పొందొచ్చు. దాంతో పాటు మరో నెల ఉచితంగా టాటా స్కై సేవలు లభిస్తాయి. ఇప్పటికే మీరు టాటా స్కై యూజర్లైతే యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.

Tata Sky Annual Flexi Plan: టాటా స్కై యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్‌ ఎలా పొందాలి?



యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్‌ తీసుకోవాలంటే మీ టాటా స్కై అకౌంట్‌లో 12 నెలలకు సరిపడా బ్యాలెన్స్ ఉండాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ.300 ప్లాన్‌లో ఉంటే మీ టాటా స్కై అకౌంట్‌లో రూ.3,600 బ్యాలెన్స్ ఉండాలి. ఒకవేళ మీరు మధ్యలో రూ.400 ప్లాన్‌కు మారినట్టైతే మరో రూ.1,200 డిపాజిట్ చేయాలి. ప్రతీ నెలా మీ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తగ్గుతుంటుంది. 12 నెలలు పూర్తైన తర్వాత 13వ నెలకు మీరు రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేకుండా సేవలు పొందొచ్చు. మీరు 12 నెలలకు కాకుండా 6 నెలలకు కూడా సెమీ-యాన్యువల్ ఫ్లెక్సీ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటాస్కై సెట్-టాప్ బాక్సుల ధరలు తగ్గాయిIndian Railways: ఇక రైలు టికెట్ల బుకింగ్ ఇంకా ఈజీ

Good News: త్వరలో 'వన్ నేషన్-వన్ డ్రైవింగ్ లైసెన్స్'
Published by: Santhosh Kumar S
First published: July 2, 2019, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading