Home /News /business /

GET MONTHLY RETURNS BY MAKING SINGLE INVESTMENT IN SBI ANNUITY DEPOSIT SCHEME UMG GH

SBI Scheme: ఎస్‌బీఐ సూపర్ స్కీమ్.. డబ్బులే డబ్బులు..!! సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో నెలనెలా ఆదాయం!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకం.

ఎస్‌బీఐ (SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ఇన్వెస్టర్లకు గ్యారెంటీడ్‌ రిటర్న్స్ అందిస్తుంది. అలాగే ఇందులో పెట్టుబడి (Investment) పెట్టడం వల్ల ఏ రిస్క్ ఉండదు. అంతేకాదు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. మరి ఈ పథకం (Scheme) గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి అందించే పథకాల కోసం ఇన్వెస్టర్లు (Investors) ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో అస్థిరత నెలకొన్న రోజుల్లో పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ స్కీమ్స్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్‌లో అలాంటి పరిస్థితే నెలకొంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న sbi యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ పథకం ఇన్వెస్టర్లకు గ్యారెంటీడ్‌ రిటర్న్స్ (Assured Returns) అందిస్తుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఏ రిస్క్ ఉండదు. అంతేకాదు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. మరి ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యాన్యుటీ డిపాజిట్ schemeలో ఇన్వెస్టర్లు ఒకేసారి తమ డబ్బును డిపాజిట్ చేయాలి. అయితే ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌లో కనీసం రూ.36 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు ఎంత మొత్తంలోనైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్వెస్ట్ చేసిన కొంతకాలం తర్వాత పెట్టుబడిదారులు ప్రతి నెలా ఒకే మొత్తంలో డబ్బు అందుకుంటారు. ఈ రిటర్న్స్‌ను మీరు డిపాజిట్ చేసిన అమౌంట్‌లో కొంత మొత్తం, వడ్డీని కలిపి ఎస్‌బీఐ చెల్లిస్తుంది. వడ్డీ అనేది మీ ఖాతాలో ఉన్న అమౌంట్‌పై లెక్కించడం జరుగుతుంది.

ఇదీ చదవండి: ఫ్యూచర్ పేమెంట్ సిస్టమ్స్‌పై ఆర్బీఐ ఫోకస్.. RBI పేమెంట్స్‌ విజన్- 2025లో కీలక అంశాలు


ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకం
ఎస్‌బీఐ కస్టమర్లు 36, 60, 84 లేదా 120 నెలల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత, కస్టమర్లు బ్యాంక్ నుంచి ప్రతి నెలా రిటర్న్‌లను పొందుతారు. ఈ పథకం కింద పెట్టుబడిదారులు తమ ఇనిషియల్ డిపాజిట్‌కి ముందుగా నిర్ణయించిన నెలవారీ మొత్తాన్ని అందుకుంటారు. ఇన్వెస్టర్లు నెలలో ఏ తేదీన డిపాజిట్ చేశారో అదే తేదీన ఎస్‌బీఐ రిటర్న్స్ అందజేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ఆ తేదీ వేరే నెలల్లో లేకపోతే.. వచ్చే నెలలో మొదటి తేదీన చెల్లింపు చేస్తుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయదలచుకున్న వారు తమ సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కి విజిట్ చేయవచ్చు. అయితే ఏ బ్రాంచ్‌లో పథకం ఓపెన్ చేసినా దాన్ని వేరే బ్రాంచీకి ఈజీగా బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు ఈ స్కీమ్ ఇన్వెస్టర్లకు ఎస్‌బీఐ యూనివర్సల్ పాస్‌బుక్‌ను జారీ చేస్తుంది.



ఈ స్కీమ్‌లో జాయిన్ అయ్యేందుకు ఎవరు అర్హులు?
భారత్‌లో నివసించే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఈ ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో investments చేసుకోవచ్చు. అయితే ఎన్ఆర్ఓ (NRO), ఎన్ఆర్ఈ (NRE) అకౌంట్స్ కింద ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ పథకంలో ఇన్వెస్ట్ చేయడం కుదరదు.
Published by:Mahesh
First published:

Tags: BUSINESS NEWS, Investments, Sbi, Scheme

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు