GET HONDA ACTIVA 110 SCOOTER FOR 23 THOUSAND RUPEES ONLY HERE OFFER DETAILS NS
Honda Activa: బంపరాఫర్.. కేవలం రూ. 23 వేలకే హోండా యాక్టీవా.. ఇలా కొనుగోలు చేయండి
బంపరాఫర్.. కేవలం రూ. 23 వేలకే హోండా యాక్టీవా.. ఇలా కొనుగోలు చేయండి
హోండా యాక్టివా (Honda Activa) స్కూటర్ అనేక మంది కస్టమర్ల మన్ననలు పొందింది. మంచి మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ (Scooter) ను కొనుగోలు చేయడానికి అనేక మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ స్కూటర్ ను ఇప్పుడు రూ. 23 వేలకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
టూ వీలర్ (Two Wheeler) కేటగిరీలో భారతదేశం అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల ప్రత్యేకతలను ఉన్న బైక్ లు వస్తున్నాయి. రూ. 60 వేల ధర నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. పలు కంపెనీలు కస్టమర్లపై దృష్టిని ఆకర్షించడానికి ఆకర్షిణీయమైన ఆఫర్లు అందిస్తూ తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నారు. అయితే ప్రముఖ స్కూటర్ హోండా యాక్టివాను (Honda Activa) ఇప్పుడు కేవలం రూ. 23,000కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. హోండా యాక్టివా మంచి మైలేజ్ మరియు మంచి ఫీచర్లతో పాపులర్ స్కూటర్‌గా అవతరించింది. ఇది వస్తువులను తీసుకెళ్లడానికి మరియు ప్రయాణించడానికి అణువుగా ఉంటుంది. యాక్టివా స్కూటర్‌ను డ్రమ్ వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ సాల్ట్ ద్వారా తక్కువ ధరకు విక్రాయానికి ఉంది. ఈ హోండా యాక్టివా స్కూటర్ కూడా 28 వేల కిలోమీటర్ల రేంజ్‌తో మంచి కండీషన్లో ఉంది. ఇది 2013 మోడల్ హోండా యాక్టివా. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయబడింది. 55kmpl మైలేజీని కలిగి ఉంది. 5-లీటర్ ఇంధన ట్యాంక్‌తో అమర్చబడి, ఇది 7500rpm మరియు 8bhp శక్తిని అందిస్తుంది. 5500rpm వద్ద 9Nm టార్క్ వద్ద నడుస్తుంది.
కస్టమర్లు కేవలం 23 వేలకే ఈ సెకండ్ హ్యాండ్ హోండా యాక్టివాను కొనుగోలు చేయవచ్చు. హోండా యాక్టివా 110సీసీ ఎక్స్ షో ధర ప్రస్తుతం రూ. 64 వేల నుంచి 65 వేల వరకు ఉంది. హోండా చాలా సంవత్సరాలుగా యాక్టివాను అప్డేటెడ్ వెర్షన్లో పరిచయం చేస్తోంది. అయితే సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనే ముందు అన్ని వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవడం ఉత్తమం. మరియు నిబంధనలు మరియు షరతులను తనిఖీ చేసి తదుపరి ఒప్పందం చేసుకోవడం మంచిది. ఈ ధరలో ఇంకా అనేక స్కూటర్లు డ్రమ్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. New Car: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. వీటన్నింటినీ ఓ సారి తప్పక చెక్ చేయండి..
ఇదిలా ఉంటే.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్స్ (Honda Motors) ఇండియా తాజాగా యాక్టివా 125 (Activa 125) ప్రీమియం ఎడిషన్ స్కూటర్ల(Scooter) ను విడుదల చేసింది. కొత్త హోండా యాక్టివా 125 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని డ్రమ్ బ్రేక్స్ ఎడిషన్ రూ. 78,725, డిస్క్ బ్రేక్ ఎడిషన్ రూ. 82,280 వద్ద విడుదలయ్యాయి. స్టాండర్డ్ యాక్టివా 125 ఎడిషన్‌కు కాస్మెటిక్ అప్డేట్ను చేర్చి తాజా వెర్షన్లను కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లు కొత్త డ్యుయల్ టోన్ కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటాయి. Volkswagen Tiguan: భారత మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ.. ధర, అదిరే ఫీచర్ల వివరాలివే!
ఇందులో మ్యాట్ మాగ్నిఫిసెంట్ కాపర్ మెటాలిక్/ పెర్ల్ అమేజింగ్ వైట్, మ్యాట్ ఎర్ల్ సిల్వర్ మెటాలిక్/ మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్టైలింగ్ అప్డేట్స్ పరంగా చూస్తే.. ఈ తాజా యాక్టివా స్కూటర్ డ్యుయల్-టోన్ బాడీ కలర్ స్కీమ్‌తో వస్తుంది. దీనిలో 125 సీసీ గేర్‌లెస్ స్కూటర్ బాడీ ప్యానెల్స్, బాడీ-కలర్ గ్రాబ్ రైల్, బ్లాక్-కలర్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్లాక్-అవుట్ ఇంజన్‌పై కొత్త డీకాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను హెండా మోటార్స్ చేర్చింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.