FASTag: గుడ్ న్యూస్... రేపటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఉచితం... 15 రోజులు మాత్రమే

FASTag Free | ఇప్పటివరకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వాహనదారులకు శుభవార్త చెప్పింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI. వాహనాలకు ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చని చెప్పింది.

news18-telugu
Updated: February 14, 2020, 2:30 PM IST
FASTag: గుడ్ న్యూస్... రేపటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఉచితం... 15 రోజులు మాత్రమే
FASTag: గుడ్ న్యూస్... ఫిబ్రవరి 29 వరకు ఫాస్ట్ ట్యాగ్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ వాహనానికి ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదా? అయితే శుభవార్త. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవడానికి రూ.100 చెల్లించాల్సి ఉండేది. కానీ... 15 రోజుల పాటు ఫాస్ట్ ట్యాగ్ కోసం వసూలు చేసే రూ.100 ఫీజును ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 మధ్య ఎవరు ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నా రూ.100 చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు. వాహనదారులు ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించి ఉచితంగా ఫాస్ట్ ట్యాగ్ పొందొచ్చు. అయితే ఫాస్ట్ ట్యాగ్ మాత్రమే ఉచితంగా ఇస్తారు. సెక్యూరిటీ డిపాజిట్, మినిమమ్ బ్యాలెన్స్ కోసం డబ్బులు చెల్లించాలి. మరి మీకు దగ్గర్లో ఉన్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఫాస్ట్ ట్యాగ్ పాయింట్ ఆఫ్ సేల్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు మై ఫాస్ట్ ట్యాగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా https://ihmcl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. లేదా 1033 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయండి.

2019 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఉండటం విశేషం. దేశంలోని 527 జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ పద్ధతి అమలులో ఉంది. ఆర్ఎఫ్ఐడీ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దాటే సమయంలో వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌ను స్కాన్ చేసి టోల్ ఛార్జీని వసూలు చేసేందుకు ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానం ఉపయోగపడుతుంది. ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేసిన తర్వాత టోల్ ప్లాజాల ద్వారా రోజువారీ ఆదాయం రూ.68 కోట్ల నుంచి రూ.87 కోట్లకు పెరిగింది. వాహనదారులు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు, రవాణా కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్స్, పెట్రోల్ బంకులతో పాటు ఎస్‌బీఐ, పేటీఎం లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Redmi Note 8: షాకిచ్చిన షావోమీ... రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది



Aadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితం

Save Money: జీతం మిగలట్లేదా? ఈ మనీ సేవింగ్ టిప్స్ ట్రై చేయండి
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు