Pan Card Apply Online | మీరు పాన్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ కార్డు (Aadhaar) కలిగిన వారు సులభంగానే పాన్ కార్డు (Pan Card) కోసం అప్లై చేసుకోవచ్చు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ కొత్త సర్వీసుల గురించి తెలుసుకోవాల్సిందే.
ఫినో పేమెంట్స్ బ్యాంక్ తాజాగా కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఆధార్ ఆధారిత అథంటికేషన్ ద్వారా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పాన్ కార్డును పొందొచ్చు. దీని కోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పాన్ కార్డు జారీ సర్వీసులను మరింత విస్తరించాలనే లక్ష్యంతో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఈ సర్వీసులు తీసుకువచ్చింది.
25 బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువంటే?
ఈ ఒప్పందంలో భాగంగా పాన్ కార్డు సర్వీస్ ఏజెన్సీ సర్వీసులు అందించే తొలి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. పేపర్‌లెస్ విధానంలో పాన్ కార్డును పొందొచ్చు. ప్రోటీన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫినో పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. అంటే ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.
రూ.50 వేల డిస్కౌంట్.. కారు కొనే వారికి బంపరాఫర్!
యూజర్లు పాన్ కార్డు పొందాలని భావిస్తే.. ఫినో బ్యాంక్ పాయింట్ల వద్దకు వెళ్లి ఆధార్ ఆధారిత అథంటికేషన్ ద్వారా సులభంగానే పాన్ కార్డు పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఇతర పత్రాలు సమర్పించాల్సిన పని లేదు. డిజిటల్ రూపంలో లేదా ఫిజికల్ రూపంలో పార్ కార్డు పొందొచ్చు. ఇపాన్ కార్డు ఆప్షన్ ఎంచుకుంటే కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది.
ఇకపోతే ఇప్పటికే పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటినీ లింక్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాన్ కార్డు చెల్లుబాటు కాకపోవచ్చు. అందువల్ల మీరు వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోండి. దీని కోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సులభంగానే రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. అయితే పాన్ కార్డులో, ఆధార్ కార్డులో వివరాలు ఒకేలా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Banks, PAN card