కరోనా మహమ్మారి ప్రభావం వల్ల చాలామంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లోనే ఉండి టైంపాస్ అవ్వడం లేదా.. అయితే పాత కరెన్సీ నాణేలను సేకరించండి. ఎందుకంటే అవే మీకు రూ.లక్షలు సంపాదించి పెట్టవచ్చు. 25 పైసల నాణేన్ని అమ్మి.. రూ.1.5 లక్షలు తిరిగి పొందవచ్చు. ఇది ఎలా సాధ్యం అనే సందేహం మీకు రావచ్చు. ఇండియా మార్ట్ వెబ్‌సైట్లో ఈ పాత నాణేలను వేలంలో పెట్టి, మంచి ధరకు విక్రయించే అవకాశముంది. ఇటీవలే ఓ వ్యక్తి అరుదైన పాత కాయిన్స్‌ను వేలంలో అమ్మి భారీగా డబ్బు సంపాదించారు. ధర విషయంలో కొనుగోలుదారులతో బేరమాడే అవకాశం కూడా వేలంలో ఉంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఇంట్లో ఉండే పాత పావల నాణేల ఫొటోను తీసి IndiaMART.com అనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ఇక్కడ ఔత్సాహికులు వేలంలో పాల్గొని వీటిని కొనుగోలు చేస్తారు. అయితే ఈ 25 పైసల నాణెం సిల్వర్ రంగులో ఉండాలి. ఈ వెబ్ సైట్ లో 5 పైసలు, 10 పైసల నాణేలు కూడా విక్రయిస్తున్నారు. వీటికి కూడా మంచి ధర పలుకుతోంది. ఇండియా మార్ట్ సైట్ లో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లోని అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్లలో ఇండియామార్ట్ కూడా ఒకటి. "ఇండియామార్ట్.. 10 కోట్లకుపైగా కొనుగోలుదారులకు, 60 లక్షల మంది సప్లయర్లకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్ లేదా తయారీదారు అయితే.. ఆన్ లైన్ వ్యాపారం పెంచుకోవడానికి ఇండియామార్ట్ మంచి వేదిక. దాదాపు 100 మిలియన్లకు పైగా వినియోగదారులను మమ్మల్ని విశ్వసించారు" అని ఈ వెబ్ సైట్ పేర్కొంది.
వైష్ణో మాత కాయిన్ల విలువ లక్షలు..
మాతా వైష్ణో దేవి ప్రతిమ ఉన్న 5, 10 పైసల నాణేలకు భారీ ధర పలుకుతోంది. వేలంలో వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 2002లో ప్రభుత్వం జారీ చేసిన ఈ నాణేలకు అధిక డిమాండ్ ఉంది. హిందువులు వైష్ణో దేవిని ఆరాధిస్తారు. అందుకే ఈ నాణేల కోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
786 సిరీస్ కు అధిక డిమాండ్..
ముస్లింలకు బాగా ప్రాచుర్యం పొందిన సంఖ్య '786'. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ సిరీస్ ఉన్న కరెన్సీ నోట్లను ముస్లింలు శుభంగా భావిస్తారు. దాన్ని సొంతం చేసుకోవడం శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రతిమలు, సంఖ్యలు ఉన్న నాణేలు లేదా నోట్లు ఉంటే.. వాటిని వెబ్ సైట్‌లో పెట్టి డబ్బు సంపాదించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.