• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GERMANY BANKING GIANT DEUTSCHE BANK TO HIRE 1000 TECHIES IN INDIA SS GH

Deutsche Bank: ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్న జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం

Deutsche Bank: ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్న జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం

Deutsche Bank: ఇండియాలో 1,000 మందిని నియమించుకోనున్న జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం (ప్రతీకాత్మక చిత్రం)

Deutsche Bank | జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం డాయిచే బ్యాంక్ భారతదేశంలో 1,000 మందిని టెకీలను నియమించుకోనుంది.

  • Share this:
మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ సేవలు అందించేందుకు జర్మన్ బ్యాంకింగ్ దిగ్గజం డాయిచే బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. బ్యాంక్ అంతర్గత సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంలో భాగంగా గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనితో పాటు కొత్తగా 1,000 మంది ఫ్రెషర్లు, ఎక్స్‌పీరియెన్స్‌డ్ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. డాయిచే బ్యాంక్ కేవలం జర్మన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫైనాన్షియల్ సేవలందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియర్ల అవసరాలను తీర్చేందుకు, తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు గత రెండేళ్లుగా బ్యాంక్ గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. ఈ మేరకు 2019–2021 మధ్య 13 బిలియన్ యూరోల మేర కేటాయించింది.

జర్మనీకి చెందిన ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం.. నైపుణ్యం గల టెక్ ఎక్స్‌పర్ట్స్‌ను రిక్రూట్ చేసుకొని ఉత్తమ సేవలందించాలని భావిస్తోంది. డాయిచే బ్యాంక్ కార్యకలాపాల్లో భారత్ ప్రధాన వ్యాపార కేంద్రం. అందుకే, ఇక్కడ మరో 1000 మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. ‘భారత్లో మా బ్యాంకుకు అవసరమైన టెక్నాలజీ అందించేందుకు, కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు మరో 1,000 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాం. ప్రధానంగా మేం ఇంజనీరింగ్, కోడింగ్ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని చెబుతున్నారు కార్పొరేట్ ఫంక్షన్ గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డాయిచే బ్యాంక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్ దిలీప్‌కుమార్ ఖండేల్వాల్ అన్నారు.

IRCTC Work from Hotel: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి బోర్ కొట్టిందా? ఈ ప్యాకేజీ మీకోసమే

SBI Mobile Number Change: ఎస్‌బీఐ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ ఇలా మార్చండి

కార్యకలాపాల విస్తరణకు 13 బిలియన్ యూరోలు


ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రాల విస్తరణకు కంపెనీ నాలుగు దేశాలను ఎంపిక చేసుకుంది. వాటిలో భారతదేశం అతిపెద్దది. భారత్లోని డాయిచే బ్యాంక్ టెక్ సెంటర్‌లో ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా తీసుకునే 1000 మందితో కలిపి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,000లకు చేరనుంది. డాయిచే బ్యాంక్కు రష్యా, యుఎస్, రొమేనియా వంటి దేశాల్లో కూడా తన టెక్ సెంటర్లను విస్తరించనుంది.ఈ కేంద్రాల్లోనే ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి.

Aadhaar Card: ఈ ఆధార్ సేవలకు ఇంటర్నెట్ అవసరం లేదు

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీలో భారత్ ఒక ప్రధాన భాగమైనప్పటికీ, ఇక్కడ ఎంత పెట్టుబడి పెడుతుందనే విషయంపై స్పష్టతలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఎంఎన్సీ కంపెనీలు కూడా భారతదేశంలో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆ తర్వాత వీటిని క్రమంగా విస్తరిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో తమ కార్యకలాపాలు నడుపుతున్న జెపి మోర్గాన్, సిటీ, హెచ్‌ఎస్‌బిసి, ఆర్‌బిఎస్ వంటి గ్లోబల్ బ్యాంకులు ఇక్కడ పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయి.
Published by:Santhosh Kumar S
First published: