హోమ్ /వార్తలు /బిజినెస్ /

Plant Oil-based Plastic: మొక్కల నూనెతో కొత్త ప్లాస్టిక్.. పర్యావరణానికి హాని చేయదంటున్న పరిశోధకులు

Plant Oil-based Plastic: మొక్కల నూనెతో కొత్త ప్లాస్టిక్.. పర్యావరణానికి హాని చేయదంటున్న పరిశోధకులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జర్మన్ శాస్త్రవేత్తలు ప్లాంట్ ఆయిల్ ఆధారిత ప్లాస్టిక్‌ను తయారు చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ ప్లాస్టిక్‌ను 10 సార్లు రీసైకిల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కల నూనెతో తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పర్యవరణానికి ఎటువంటి హాని కలిగించదని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కరిగిపోవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ ఈ విషయం తెలిసినా ప్రజలు మాత్రం ప్లాస్టిక్ వస్తువులను విరివిగా వాడేస్తున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ అనేది పెనుభూతంలా మారింది. అయితే ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా ఎకో-ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మన్ శాస్త్రవేత్తలు ప్లాంట్ ఆయిల్ ఆధారిత ప్లాస్టిక్‌ను తయారు చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ ప్లాస్టిక్‌ను 10 సార్లు రీసైకిల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కల నూనెతో తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పర్యవరణానికి ఎటువంటి హాని కలిగించదని చెబుతున్నారు. జర్మనీలోని కాన్ స్టాంజ్ యూనివర్సిటీలోని కెమికల్ మెటీరియల్ సైన్స్ విభాగానికి చైర్మన్ అయిన స్టీఫన్ మెకింగ్ ఈ సరికొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేశారు.

ఈ ప్లాస్టిక్‌ను సులభంగా ప్రాసెసింగ్‌ చేసేందుకు బ్రేకప్ ఎవే పాయింట్లను పరమాణు స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్లాస్టిక్.. ప్రాసెసింగ్‌ చేసే సమయంలో వెంటనే విడిపోతుంది. ప్లాస్టిక్ లోని మిశ్రమం చాలా తేలికగా విడిపోతుంది కాబట్టి రీసైకిల్ చేయడానికి సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.

ప్రస్తుతం మనం వినియోగిస్తున్న శిలాజ ఇంధన-ఆధారిత ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడానికి.. మొదట దానిని ముక్కలుగా విభజిస్తారు. తర్వాత చిన్న గుళికలుగా మార్చి కొత్త ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తారు. అయితే రసాయన ప్రక్రియ ద్వారా ప్లాస్టిక్ పాలిమర్ ను ద్రావకం తో విచ్ఛిన్నం చేయాలని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఒక్క కెమికల్ ప్రాసెస్ ని కూడా అభివృద్ధి చేయలేకపోయారు.

కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా రీ సైక్లింగ్ చేయడం అనేది చాలా సవాళ్ళతో కూడుకున్నది. ప్లాస్టిక్ పరమాణువులలోని కార్బన్ బాండ్స్ ని తీయడం చాలా కష్టతరమైనది. కార్బన్ బాండ్స్ ని విడగొట్టడానికి 600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అప్పుడు విడిపోయిన అణువులను మళ్లీ 10 పర్సెంట్ రేటుతో కొత్త వస్తువులు తయారు చేయాల్సి ఉంటుంది.


అయితే కొత్తగా తయారు చేసిన ప్లాస్టిక్‌ను త్వరగా ప్రాసెస్ చేసి అత్యధిక రేటుతో నూతన వస్తువులను తయారు చేయవచ్చు. శాస్త్రవేత్తలు దీన్ని శాస్త్రీయంగా చేసి చూపించారు. ప్లాంట్ ఆయిల్ ఆధారిత ప్లాస్టిక్‌ ధర ప్రస్తుతం వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల కంటే అధికంగా ఉంటుంది. మరి చాలా చౌకగా దొరికే ప్లాస్టిక్ వస్తువులను గాలికి వదిలేసి ఖరీదైన ఈ ప్లాస్టిక్ కొనుగోలు చేస్తారా లేదా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.

First published:

Tags: Business

ఉత్తమ కథలు