Home /News /business /

GERMAN AUTO MAJOR VOLKSWAGEN GROUP HAS STARTED TESTING SOME ELECTRIC VEHICLES FROM THE SKODA BRAND IN INDIA GH SRD

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలను టెస్టింగ్‌ చేస్తున్న దిగ్గజ కంపెనీ.. త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త ఈవీలు..

Photo Credit : Reuters

Photo Credit : Reuters

Electric Vehicles : వివిధ స్థాయిలలో ఎలక్ట్రిఫికేషన్ జరుగుతోంది. ఈ అంశంలో చైనా, ఉత్తర అమెరికా వేగంగా కదులుతున్నాయి. భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ (Volkswagen) ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles)ను రిలీజ్ చేయనుంది. స్కోడా బ్రాండ్ కింద కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ టెస్టింగ్‌ చేస్తోంది. మాస్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఎలక్ట్రోమోబిలిటీ కోసం దేశానికి తీసుకురావాల్సిన ప్రొడక్టులపై పని చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.భారతదేశం (India)లో గ్రోత్‌ను డెవలప్‌ చేసే బాధ్యతను వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ స్కోడా ఆటోకి(SKODA AUTO)కి అప్పగించింది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్(ICE) వాహనాలపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ అరోరా.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉందని గుర్తించామని, ఇప్పటికే పోర్షే టైకాన్, ఆడి ఇ-ట్రాన్‌లను విడుదల చేశామని చెప్పారు. ఈ మోడళ్లకు ఇండియన్‌ మార్కెట్లో ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్ద ఎత్తున తీసుకురావడం అనేది మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు.

అరోరా మాట్లాడుతూ.. ‘ఎలక్ట్రోమోబిలిటీ కోసం భారతీయ మార్కెట్లోకి ఏ ప్రొడక్టులను తీసుకురావాలనే దానిపై స్కోడా, వోక్స్‌వ్యాగన్‌ కలిసి పని చేస్తున్నాయి. ఇప్పటికే స్కోడా బ్రాండ్ కోసం కొన్ని వాహనాలను టెస్ట్‌ చేశాం. వాటిని లాంచ్‌ చేయడానికి సరైన సమయం కోసం చూస్తున్నాం. లగ్జరీ సెగ్మెంట్ దిగువన ఉన్న భారతీయ మార్కెట్ కోసం వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ఆల్-ఎలక్ట్రిక్ పోర్స్చే టైకాన్ ప్రారంభ ధర రూ.1.5 కోట్లు కాగా, ఆడి ఇ-ట్రాన్ ధర రూ.99.99 లక్షల నుంచి రూ. 1.18 కోట్ల వరకు ఉంది. ఎలక్ట్రో-మొబిలిటీ పరంగా చూస్తే లగ్జరీ బ్రాండ్‌లతో టాప్-డౌన్ విధానాన్ని అనుసరించాం. ఇప్పటికే ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాం. ఆడి, పోర్షే రెండూ లాంచ్‌ చేసిన ఎలక్ట్రిక్‌ వాహనాలు భారతీయ మార్కెట్లో సక్సెస్ అయ్యాయి.’ అని వివరించారు.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన టాప్ బ్యాంకులు.. లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు ఇవే..

ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లో ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని, బెంట్లీలతో సహా ఇతర బ్రాండ్‌ల ద్వారా భారతదేశంలో సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, 2035 నాటికి అన్ని జీరో ఎమిషన్‌ వాహనాలను విక్రయించడానికి యూరప్ కట్టుబడి ఉంది. వివిధ స్థాయిలలో ఎలక్ట్రిఫికేషన్ జరుగుతోంది.

ఈ అంశంలో చైనా, ఉత్తర అమెరికా వేగంగా కదులుతున్నాయి. భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని అరోరా అన్నారు. కాబట్టి, డీకార్బనైజేషన్, ఈవీల వృద్ధి కోసం వ్యూహాలను భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారతదేశంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి 15-16 శాతం నుంచి 30 శాతానికి పెరగవచ్చని చెప్పారు.

వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ 'ఇండియా 2.0' ప్రాజెక్ట్ కింద దేశంలో తమ ఉనికిని పెంచుకునే వ్యూహంలో భాగంగా 2019, 2021 మధ్య 1 బిలియన్ యూరోల పెట్టుబడిని 2018లో ప్రకటించింది. 2025 నాటికి భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో 5 శాతాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Electric Vehicles, India, Volkswagen

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు