Home /News /business /

GEOJIT CREDITS LAUNCHES LOAN AGAINST SHARES ON DIGITAL PLATFORM PROVIDES LOAN IN MINUTES SS

Loan Offer: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒకే ఒక్క నిమిషంలో లోన్

Loan Offer: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒకే ఒక్క నిమిషంలో లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

Loan Offer: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒకే ఒక్క నిమిషంలో లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Loan Offer | స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్. క్షణాల్లో రుణాలు ఇచ్చేందుకు జియోజిత్ క్రెడిట్స్ (Geojit Credits) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

    మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి కంపెనీల షేర్లు కొంటున్నారా? మీకు గుడ్ న్యూస్. మీరు కొన్న షేర్ల పైన లోన్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే పలు సంస్థలు షేర్లను తాకట్టు పెట్టుకొని అనేక కంపెనీలు రుణాలు ఇస్తున్నాయి. అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియోజిత్ క్రెడిట్స్ (Geojit Credits) లోన్ అగెయినెస్ట్ షేర్స్ అంటే షేర్లకు లోన్ ఇచ్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లో (NSDL) రిజిస్టర్ అయిన డీమ్యాట్ అకౌంట్ హోల్డర్‌కు వారి షేర్లకు రుణాలు ఇచ్చే మొదటి కంపెనీ ఇదే.

    కొచ్చిలో ఈ సర్వీస్ ప్రారంభించిన ఎన్ఎస్‌డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజా చుండూరు మాట్లాడుతూ లోన్ అగెయినెస్ట్ షేర్స్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లకు తక్షణమే రుణాలు లభిస్తాయని అన్నారు. ఇతర ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి, వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఈ రుణసదుపాయం ఉపయోగించుకోవచ్చు అన్నారు. లోన్ అగెయినెస్ట్ షేర్స్ సదుపాయం ఉపయోగించుకోవాలంటే ఇన్వెస్టర్లకు ఎన్ఎస్‌డీఎల్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్న షేర్లకు లోన్ లభిస్తుంది. ఈ షేర్లను ప్లెడ్జ్ చేస్తే అంటే తాకట్టు పెడితే కేవలం ఒకే ఒక్క నిమిషంలో లోన్ లభిస్తుంది.

    Vistara Airlines: ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్ రూ.977 మాత్రమే

    లోన్ మంజూరు చేయడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుందని జియోజిత్ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సీజే జార్జ్ తెలిపారు. లోన్ అప్లికేషన్‌పైన డిజిటల్ సంతకం చేసిన తర్వాత రుణం మంజూరవుతుంది. లోన్ మొత్తం బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఈ రుణానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉపయోగించుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించాలి.

    ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణాలు తీసుకునేవారికి రీపేమెంట్ కోసం సులభతమైన ఆప్షన్స్ ఉంటాయని, వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయని జార్జ్ తెలిపారు. భారతదేశంలో లోన్ అగెయినెస్ట్ షేర్స్ మార్కెట్ విలువ 2021 అక్టోబర్ నాటికి రూ.55,300 కోట్లు ఉందని, వార్షికంగా 23-25 శాతం పెరగొచ్చని అన్నారు. అయితే పేపర్ వర్క్ ఎక్కువగా ఉన్నందుకు వేగంగా రుణాలు పొందలేకపోతున్నారని తెలిపారు.

    IRCTC Govindam Tour: హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్... శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం... ప్యాకేజీ ధర రూ.4,000 లోపే

    అయితే లోన్ అగెయినెస్ట్ షేర్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం ప్రాసెస్ డిజిటల్ పద్ధతిలో జరిగిపోతుందని, నిమిషాల్లోనే లోన్ వస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పైన లోన్ తీసుకోవాలంటే జియోజిత్ క్రెడిట్స్ జాబితాలో ఉన్న షేర్లు డీమ్యాట్ అకౌంట్లలో ఉండాలి. అన్ని షేర్లకు రుణాలు లభించవు. దీంతో పాటు సిబిల్ స్కోర్ బాగుండాలి. బ్రోకర్‌తో సంబంధం లేకుండా ఎన్ఎస్‌డీఎల్ అకౌంట్ ఉంటే చాలు... ఈ ప్లాట్‌ఫామ్‌పై లోన్ తీసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Personal Finance, Personal Loan, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు