General Budget 2019 : ఇన్‌కం టాక్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంచుతారా? కేంద్రం ఎన్నికల బొనాంజా ఇస్తుందా?

General Budget 2019 : ఎన్నికల ఏడాది కావడంతో... ఈసారి బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని బాగా పెంచుతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలు వద్దని అరుణ్ జైట్లీ అంటున్నారు. పన్ను మినహాయింపు పెంచుతారా?

Krishna Kumar N | news18-telugu
Updated: January 16, 2019, 4:31 PM IST
General Budget 2019 : ఇన్‌కం టాక్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంచుతారా? కేంద్రం ఎన్నికల బొనాంజా ఇస్తుందా?
ఇన్‌కం టాక్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంచుతారా?
  • Share this:
2014లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి పూర్తి అనుకూల వాతావరణం ఉంది. ఐదేళ్ల తర్వాత అదే బీజేపీకి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అందువల్ల ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకటన చేస్తారని తెలిసింది. ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయ పన్నుపరిమితి రూ.2.5 లక్షల వరకు ఉంది. అందువల్ల ఏడాదికి 2.5 లక్షల వరకు ఆదాయం వచ్చేవారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అంతకు మించిన ఆదాయం పై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ప్రధాని మోడీ భావిస్తున్నారన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. అదే నిజమైతే దేశ ప్రజలకు ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది. ఇదో సంచలన నిర్ణయమే అవుతుంది. ఏటా బడ్జెట్లు ప్రవేశపెట్టడం, ఆదాయ పన్ను పరిమితి పెంచుతారని ప్రజలు ఆశించడం, చివరకు చేదు వార్త వినడం కామనవుతోంది. గతేడాది కూడా అదే జరిగింది. ఈసారి కమలనాథులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఓటర్లను ఆకర్షించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

రూ.5-10 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.10-20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై 25 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకో 100 రోజుల టైమ్ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్ని ఆకట్టుకోవడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందిస్తున్నారని సమాచారం. ప్రత్యక్ష పన్నుల్లో మార్పులున్నా... పరోక్ష పన్నుల విధానంలో పెద్దగా మార్పులు చేయట్లేదని తెలిసింది. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు విధించే పన్ను రేటులో మార్పులు ఉండే అవకాశం లేదన్నది ఢిల్లీ వర్గాల సమాచారం.

ఇవి కూడా చదవండి:


కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అస్వస్థత


Makar Sankranti 2019: భోగి రోజు రూ.50 కోట్ల కోడి పందేలు... సంక్రాంతికి చేతులెత్తేస్తున్న పోలీసులు


సంక్రాంతి నాడు ప్రధాని మోదీ ఒడిశా, కేరళలో పర్యటన... ప్రాజెక్టుల ప్రారంభం

Published by: Krishna Kumar N
First published: January 15, 2019, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading