GENERAL ATLANTIC TO INVEST RS 3675 CRORE IN RELIANCE RETAIL SK
Reliance-General Atlantic: రిలయన్స్ రిటైల్‌లో జనరల్ అట్లాంటిక్ రూ.3675 కోట్ల పెట్టుబడి
రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.6,598 కోట్ల పెట్టబడులు పెట్టింది జనరల్ అట్లాంటిక్.
రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.6,598 కోట్ల పెట్టబడులు పెట్టింది జనరల్ అట్లాంటిక్.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి పెట్టుబడుల వరద పారుతోంది. ఇప్పటికే సిల్వర్ లేక్, కేకేఆర్ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టగా.. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను రూ.3675 కోట్లకు కొనుగోలు చేయనుంది. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల విలువ రూ.4.28 లక్షల కోట్లకు చేరింది. ఈ నెలలో రిలయన్స్ రిటైల్‌లోకి పెట్టుబడులు రావడం ఇది మూడోసారి. సెప్టెంబర్ 9న సిల్వర్ లేక్ సంస్థ రూ.7,500 కోట్ల పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను కొనుగోలు చేసింది. సెప్టెంబరు 23న కేకేఆర్ రూ.5,550 పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాత వాటాను దక్కించుకుంది.
రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి పెట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మేలో రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ జియోలో రూ.6,598 కోట్ల పెట్టబడులు పెట్టింది జనరల్ అట్లాంటిక్.
జనరల్ అట్లాంటిక్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత పెరగడం సంతోషంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్‌లో వర్తకులు, వినియోగదారుల సాధికారతే లక్ష్యంగా రిటైల్ రంగంలో సంస్కరణలు తెస్తామని తెలిపారు. రిలయన్స్ లాగే డిజిటలీకరణతోనే అభివృద్ధి సాధ్యమని జనరల్ అట్లాంటిక్ కూడా విశ్వసిస్తుందని అన్నారు. రిలయన్స్ రిటైల్‌లోకి జనరల్ అట్లాంటిక్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. వర్తకులతో పాటు వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా రిటైల్ ఎకో సిస్టమ్‌లో సంస్కరణలు చేపడతామని అన్నారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలతో కలిసి రిటైల్ రంగంలో పనిచేసిన అనుభవం జనరల్ అట్లాంటిక్‌కు ఉందని పేర్కొన్నారు.
భారత్ రిటైల్ రంగంలో పెను మార్పులు తెచ్చే రిలయన్స్ న్యూ కామర్స్ మిషన్‌లో భాగస్వామిగా చేరినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ తెలిపారు. అంతర్జాతీయ డిజిటల్ ఎకానమీలో భారత్‌ను మెరుగైన స్థానంలో నిలబెట్టేందుకు రిలయన్స్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉండడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.24,713 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ (ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, రిలయన్స్ రిటైల్.. భారత్‌లో అతిపెద్ద రిటైల్ సంస్థ. దేశవ్యాప్తంగా 7వేల నగరాల్లో 12వేల స్టోర్లు నిర్వహిస్తోంది. తద్వారా 64 కోట్ల మందికి సేవలందిస్తోంది. భారత్‌లో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు ధీటుగా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.
మరోవైపు జియోలోనూ పలు అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. జియో ప్లాట్‌ఫాంల్లో మొదట ఫేస్ బుక్ పెట్టుబడి పెట్టింది. రూ.43,573 కోట్లు పెట్టుబడి పెట్టి జియోలో 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ జియోలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. రెండు విడుతల్లో 2.08 శాతం వాటాను కొనుగోలు చేసింది. అందుకోసం రూ.10,202.55 కోట్లను రిలయన్స్‌కు చెల్లించింది సిల్వర్ లేక్. జియోలో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టిన తర్వాత దానికి పోటీగా ఉండే ఈక్విటీ సంస్థలు కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్ లాంటి కంపెనీలు కూడా జియోలో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ఆయా సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలైన గూగుల్ కూడా జియోలో వాటాలను కొనుగోలు చేసింది. అలాగే, అబుదాబికి చెందిన ముబదాలా కూడా జియోలో ఇన్వెస్ట్ చేసిది.