Reliance Retail-General Atlantic Deal: రిలయన్స్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి.. ఇవీ కీలక అంశాలు

మనదేశంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ధీటుగా దేశంలో రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో రిలయన్స్ రిటైల్ ముందుకెళ్తోంది.

news18-telugu
Updated: September 30, 2020, 2:45 PM IST
Reliance Retail-General Atlantic Deal: రిలయన్స్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడి.. ఇవీ కీలక అంశాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు ధీటుగా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలని  రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.  అందులో భాగంగానే అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలో రిలయన్స్ రిటైల్‌లో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. రూ.3675 కోట్లు వెచ్చించి రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేయనుంది జనరల్ అట్లాంటిక్. సెప్టెంబరు నెలలో రిలయన్స్ రిటైల్‌లోకి ప్రముఖ సంస్థలు పెట్టబడులు పెట్టడం ఇది మూడోసారి.

రిలయన్స్‌- జనరల్ అట్లాంటిక్ డీల్‌లో కీలక అంశాలు:

అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ రూ.3,675 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 0.84శాతం వాటాను దక్కించుకోనుంది.

జనరల్ అట్లాంటిక్‌ ఒప్పందంతో రిలయన్స్ రిటైల్ ప్రి మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.28 లక్షల కోట్లకు చేరింది.

జనరల్ అట్లాంటిక్ సంస్థ ఇంతకు ముందు రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ 'జియో'లో రూ.6,598 కోట్ల పెట్టబడులు పెట్టింది.

ఈ నెలలో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్ రిలయన్స్‌లో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకునేందుకు ఒప్పందం చేసుకుంది.

గత వారంలో మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR & Co రూ.5,550 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ రిటైల్‌లో 1.28శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ధీటుగా దేశంలో రిటైల్ వ్యాపారాలను విస్తరించాలన్న లక్ష్యంతో రిలయన్స్ రిటైల్ ముందుకెళ్తోంది.

రిలయన్స్ రిటైల్.. భారత్‌లో అతిపెద్ద రిటైల్ సంస్థ. దేశవ్యాప్తంగా సుమారు 7వేల నగరాల్లో 12వేల స్టోర్‌లు నిర్వహిస్తోంది. తద్వారా 64 కోట్ల మందికి సేవలందిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 30, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading