Home /News /business /

GEMOPAI ELECTRIC INTRODUCED ITS MINI E SCOOTER MISO ON THE MARKET ON FRIDAY IT COSTS RS 44000 MK

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఒక్కసారి చార్జ్ చేస్తే...75 కిలోమీటర్ల మైలేజ్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

సుమారు లక్ష దాకా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచంలోని చౌకైన ఇ-స్కూటర్ ఇప్పుడే ఇండియా మార్కెట్లోకి ప్రవేశించింది. జెమోపాయ్ ఎలక్ట్రిక్ తన మినీ ఇ-స్కూటర్ మిసోను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర కేవలం రూ. 44 వేలు మాత్రమే...

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ప్రపంచమంతా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై కదులుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద ఆటో దిగ్గజ కంపెనీలు సైతం ఎలక్ట్రికల్ వాహనాల తయారీ, అమ్మకాల దృష్టి సారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ వాహనాలు అంటే వాటి ధర చాలా ఎక్కువగా ఉండేది. సుమారు లక్ష దాకా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచంలోని చౌకైన ఇ-స్కూటర్ ఇప్పుడే ఇండియా మార్కెట్లోకి ప్రవేశించింది. జెమోపాయ్ ఎలక్ట్రిక్ తన మినీ ఇ-స్కూటర్ మిసోను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంతేకాదు జెమోపాయ్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మూడేళ్ల సర్వీస్ వారంటీని ప్రకటించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్


ఈ వారంటీ సంస్థ జెమోపాయి అస్ట్రిడ్ లైట్, జెమోపాయ్ రైడర్, జెమోపాయ్ మిసో అనే మూడు ఎలక్ట్రానిక్ స్కూటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంతేకాదు మూడేళ్ల సర్వీస్ వారంటీని కూడా కంపెనీ ప్రకటించింది. ఈ సంస్థ Goreen E-Mobility, Opai Electric జాయింట్ వెంచర్. ఈ స్కూటర్ ధర రూ. 44,000 గా నిర్ణయించారు.

ఎలక్ట్రిక్ స్కూటర్


3 సంవత్సరాల కాలంలో మొత్తం 12 సర్వీసులను పూర్తి ఉచితంగా ఇచ్చారు, హెక్సా హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ బ్యాటరీ, ఇండికేటర్ ఇందులో ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ స్కూటర్‌లో 1KW లి-అయాన్ బ్యాటరీ ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒకసారి చార్జీ చేస్తే ఛార్జీతో 75 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ మినీ స్కూటర్‌ను 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా 60 కి పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్


బుకింగ్ చేసుకుంటే రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది, కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 కి పైగా డీలర్‌షిప్‌లు ఉండగా, ఒక సర్వీస్ సెంటర్ కూడా ఉంది. 2020 జూలై 25 వరకు అన్ని బుకింగ్‌లకు కంపెనీ రూ. 2,000 తగ్గింపును అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ను 4 కలర్ ఆప్షన్ లో లభిస్తోంది. ఇందులో ఫెయిరీ రెడ్, డీప్ స్కై బ్లూ, లూషియస్ గ్రీన్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ ద్వారా మార్కెట్లో లభిస్తోంది. ఈ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఆర్టీఓ నుంచి పర్మిట్ పొందవలసిన అవసరం లేదు.
Published by:Krishna Adithya
First published:

Tags: Business, BUSINESS NEWS, SCOOTER

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు