e-Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం సూపర్ ఇ స్కూటర్ (Scooter) ఒకటి అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే దీన్ని కొనొచ్చు. అలాగే రేంజ్ ఎక్కువ. ఫీచర్లు కూడా అదిరిపోయాయి. ఇంతకీ అది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Vehicle) అని ఆలోచిస్తున్నారా? జెమోపి కంపెనీ మార్కెట్‌లో పలు రకాల మోడళ్లన అందిస్తోంది. వీటిల్లో ఆస్ట్రిడ్ లైట్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిస్తోంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీపై కంపెనీ మూడేళ్ల వరకు వారంటీ ఇస్తోంది. క్విక్ చార్జ్ సపోర్ట్ ఉంటుంది. 2 గంటల్లోనే 80 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇకపోతే ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది.
బంపరాఫర్.. రూ.7 లక్షల ట్రాక్టర్ ఫ్రీ, ఉచితంగా 8 గ్రాముల బంగారం.. ఎలా పొందాలంటే?
జెమోపి ఆస్ట్రిడ్ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్‌లో 2.88 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. పవర్ 4 కేడబ్ల్యూ. కీలెస్ ఎంట్రీ ఉంది. ఈ స్కూటర్ మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. 1.7 కేడబ్ల్యూ వేరియంట్ ధర రూ. 92,322గా ఉంది. ఇక 2.16 కేడబ్ల్యూ వేరియంట్ ధర రూ. 99,369. అలాగే 2.88 కేడబ్ల్యూ వేరియంట్ ధర రూ.1,11,195గా ఉంది.
రూ.200 పొదుపుతో రూ.10 లక్షలు పొందండి.. ఎస్‌బీఐ సూపర్ స్కీమ్!
ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సైడ్ స్టాండ్ సెన్సార్, స్పోర్టీ డిజైన్, స్టైలిష్ టెయిల్ ల్యాంప్, 2.4 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ మోటార్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడో మీటర్, యూఎస్‌బీ చార్జింగ్, వివిధ రైడ్ మోడ్స్, డీఆర్ఎల్ లైట్స్, టెలీస్కోపిక్ సస్పెన్షన్, రియర్ డ్రమ్ బ్రేక్, ట్యూబ్ లెస్ ట్రైర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌లోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకోవచ్చు. లేదంటే టెస్ట్ డ్రైవ్ కోసం కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన తర్వాత స్కూటర్ కొనొచ్చు.
కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నెలకొంది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో దుమ్ము రేపుతోంది. తర్వాత టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు కూడా అదరగొడుతున్నాయి. అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కొనొచ్చు. ఇందులో కూడా అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. అయితే వీటి రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric bike, Electric Scooter, Electric Vehicle, Ev scooters