Home /News /business /

GATES FOUNDATION ANNOUNCES USD 1 BILLION FINANCIAL AID TO ADDRESS POVERTY SOCIAL INEQUALITIES KMV

Bill Gates: నువ్వు దేవుడయ్యా..పేదలకు రూ.10 వేల కోట్ల విరాళం!

Bill Gates: నువ్వు రాజువయ్యా..పేదలకు రూ.10 వేల కోట్ల విరాళం!

Bill Gates: నువ్వు రాజువయ్యా..పేదలకు రూ.10 వేల కోట్ల విరాళం!

Melinda Gates | బిల్ గేట్స్ గురించి మనకు అందరికీ తెలుసు. ఈయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా చాలా విరాళాలు అందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి బిల్ గేట్స్ ఆయన మంచి మనసును చాటుకున్నారు. భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Bill and Melinda Gates Foundation | బిట్ గేట్స్ దంపతుల విరాళాలు అందించడంలో అందరి కన్నా ముందు వరుసలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉంటూ వస్తున్న బిల్ గేట్స్ (Bill Gates) ఆయన సంపదలో చాలా భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నారు. చాలా సార్లు చాలా మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా ఇప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే ఒకటి తీసుకున్నారు. పేదరికాన్ని, సామాజిక అసమానతలను ఎదుర్కునేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ (Melinda Gates) ఫౌండేషన్ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. 1.27 బిలియన్ల డాలర్ల తాజా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన కరెన్నీలో చెప్పుకుంటే దీని విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుంది. రెండు రోజుల పాటు జరిగిన గోల్‌కీపర్స్ కార్యక్రమం ముగింపులో బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ఈ ప్రకటన చేసింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా 300 మంది యువకులు పాల్గొన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తన వార్షిక గోల్‌కీపర్స్ నివేదికలో యూఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కు సంబంధించిన దాదాపు ప్రతి సూచిక 2030 నాటికి సాధించడానికి వీలు లేకుండా ఉందనే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ ఈ భారీ ఆర్థిక సాయాన్నిప్రకటించడం గమనార్హం. బంగారం ధర రూ.6,500 పతనం.. వెండి రూ.19 వేలు ఢమాల్! ఆల్‌టైమ్ గరిష్టం నుంచి.. పేదరికం, అసమానతలు, వాతావరణ మార్పులు సహా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాల్సి ఉందని, వినూత్నమైన విధానాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పురోగతిని వేగవంతం చేసే అవకాశాలను అందిపుచ్చుకోవాలని నివేదిక హైలైట్ చేసింది. న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌లో రెండు రోజుల గోల్‌కీపర్స్ ఈవెంట్ జరిగింది. అదేసమయంలో యూఎన్ జనరల్ అసెంబ్లీ వార్షిక సెషన్‌ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. కస్టమర్లకు రూ.5 లక్షలు! ‘మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, వీటి పరిష్కరం, అలాగే జీవితాలను రక్షించడానికి, మెరుగుపరచడానికి శాశ్వతమైన పరిష్కారాల అవసరాన్ని ఈ వారం మనం తెలుసుకున్నాం’ అని గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సుజ్మాన్ తెలిపారు. అందుకే తమ ఫౌండేషన్ ఇప్పుడు సంక్షోభాలను ఎదుర్కోవడంలో సహాయం చేస్తోందన్నారు. అలాగే ఆరోగ్యం, అభివృద్ధికి కీలక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎవరి కోసం అయితే సాయం చేస్తున్నామో.. వారికి ప్రయోజనం లభించకపోతే.. ఎంత మంచి కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఫలితం ఉండదని గేట్స్ ఫౌండేషన్ కో-చైర్‌పర్సన్ మిలిందా ఫ్రెంచ్ గేట్స్ చెప్పారు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Bill Gates, Melinda gates, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు