GAS CYLINDER PRICE DECREASE BY 53 RUPEES KNOW NEW RATE FOR MARCH 2020 NK
LPG Cylinder Price : వంట గ్యాస్ బండ రేటు తగ్గింది... కొత్త రేట్ల వివరాలు ఇవీ...
(File)
LPG Cylinder Price : సబ్సిడీ కాని వంట గ్యాస్ బండ ధర మెట్రో నగరాల్లో రూ.50 రూపాయల కంటే ఎక్కువే తగ్గింది. మార్చి 1 నుంచి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
LPG Gas Prices Today : పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలా పెంపులు, తగ్గింపులు ఉంటున్నాయో... వంటగ్యాస్ రేట్ల విషయంలోనూ అదే పరిస్థితి. తాజాగా... మార్చి 1 నుంచి సబ్సిడీ కాని వంటగ్యాస్ బండ రేట్లు తగ్గించారు. 2019 ఆగస్టులో ఇలా తగ్గించారు. మళ్లీ ఇప్పుడే అది చూస్తున్నాం. ఐతే... తగ్గింది కదా అని మనం సంతోష పడాల్సిన పనిలేదు. ఎందుకంటే... ఆరు నెలలుగా వంటగ్యాస్ బండ ధరలు ఆరుసార్లు పెంచారు. తాజాగా ఢిల్లీ, ముంబైలో సబ్సిడీ కాని వంటగ్యాస్ బండ 14.2 కేజీల బరువు ఉండే దాని ధరను రూ.53 రూపాయలు తగ్గించారు. కానీ... గతేడాది ఆగస్టు నుంచీ ఫిబ్రవరి మధ్య వంటగ్యాస్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. అందువల్ల ఇప్పుడు తగ్గించినా పెద్దగా తగ్గించినట్లు కాదనే అనుకోవచ్చు.
మార్చి 1 2020 నుంచీ ఢిల్లీలో గ్యాస్ బండ కోసం రూ.805.5 చెల్లించాల్సి ఉంటుంది.... ముంబైలో రూ.776.5 చెల్లించాలి. నిన్నటివరకూ ఈ ధర రూ.858.5,... 829.5 శాతంగా ఉంది.
మెట్రో నగరాల్లో సబ్సిడీ కాని LPG సిలిండర్ (14.2 కేజీలు) ధరలు (మార్చి 1 నుంచి) :
నగరం
ప్రస్తుత ధర
పాత ధర
ఢిల్లీ
805.5
858.50
కోల్కతా
839.5
896.00
ముంబై
776.5
829.50
చెన్నై
826.0
881.00
(Source: iocl.com)
వంటగ్యాస్ సప్లై చేసే ఇండియన్ ఆయిల్ లాంటి కంపెనీలు... నెలకోసారి ధరలపై సమీక్షిస్తున్నాయి. మార్చి 1 నుంచీ 19 కేజీల సిలిండర్ రేటు ఢిల్లీలో రూ.1381.5 కాగా ముంబైలో ఇది రూ.1331గా ఉంది. ఇంతకు ముందు వీటి రేట్లు రూ.1466, రూ.1540గా ఉండేవి. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాల వల్లే వంటగ్యాస్ ధరలు తగ్గుతున్నాయి. వచ్చే నెలలో కూడా మరింత తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్ల వరకూ సబ్సిడీ రూపంలో ఇస్తోంది. ఆపై కావాలంటే మాత్రం సబ్సిడీ ఉండదు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.