ఏప్రిల్, మే నెలల్లో గంగానది పుష్కరాలు జరగనున్నాయి. ఏప్రిల్ 22న మొదలయ్యే గంగానది పుష్కరాలు (Ganga Pushkaralu) మే 3న ముగుస్తాయి. వారణాసి, అలాహాబాద్, గంగోత్రి, హరిద్వార్, బద్రీనాథ్ లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరగబోయే గంగానది పుష్కరాల్లో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. మరి మీరు కూడా గంగానది పుష్కరాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. గంగా పుష్కరాల యాత్ర (Ganga Pushkarala Yatra) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 18న, ఏప్రిల్ 29న అందుబాటులో ఉంటుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో (Bharat Gaurav Tourist Train) పర్యాటకుల్ని తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీ విశేషాలు తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం గంగా పుష్కరాల యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం , విజయనగరం రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. మొత్తం 656 బెర్తులు అందుబాటులో ఉంటాయి. వీటిలో స్లీపర్ బెర్తులు 432, థర్డ్ ఏసీ బెర్తులు 180, సెకండ్ ఏసీ బెర్తులు 44 ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
Akshaya Tritiya: అక్షయ తృతీయకు నెల రోజులు... బంగారం ఇప్పుడు బుక్ చేయడమే మంచిదా?
Take a break from the hustle of ordinary life and experience the extraordinary. Witness Varanasi's Ganga Aarti on a grand scale with #IRCTC's Ganga Pushkarala Yatra: Puri-Kashi-Ayodhya #tourpackage.
Book now on https://t.co/HXEwjt6aat — IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) March 24, 2023
Day 1: ఐఆర్‌సీటీసీ గంగా పుష్కరాల యాత్రలో భాగంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరంలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు.
Day 2: రెండో రోజు ఉదయం మధ్యాహ్నం మాల్తీ పాత్‌పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని పూరీ తీసుకెళ్తారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి పూరీలో బస చేయాలి.
Day 3: మూడో రోజు పూరీ నుంచి కోణార్క్ తీసుకెళ్తారు. కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మాల్తీ పాత్‌పూర్‌కు తిరిగి తీసుకెళ్తారు. అక్కడ రైలు ఎక్కి గయకు బయల్దేరాలి.
Day 4: నాలుగో రోజు గయ చేరుకుంటారు. గయలో పిండ ప్రదాన కార్యక్రమం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వారణాసికి బయల్దేరాలి.
Day 5: ఐదో రోజు వారణాసి చేరుకుంటారు. గంగా నది పుష్కరాల్లో పాల్గొనొచ్చు. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్ణ దేవి ఆలయం దర్శించుకోవచ్చు. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
Day 6: ఆరో రోజు ఉదయం వారణాసి నుంచి అయోధ్య బయల్దేరాలి. అయోధ్య చేరుకున్నాక రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్శన ఉంటుంది. సాయంత్రం సరయు నది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి.
Day 7: ఏడో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన్ మండపం సందర్శించుకోవచ్చు. ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు స్వస్థలానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఈ 5 సమస్యలు తప్పవు మరి
ఐఆర్‌సీటీసీ టూరిజం గంగా పుష్కరాల యాత్ర ప్యాకేజీ ధరలు చూస్తే భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్‌లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది. కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,955 కాగా, సింగిల్ షేర్ ధర రూ.15,300. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,510 కాగా, సింగిల్ షేర్ ధర రూ.24,085. ఇక కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,615 కాగా, సింగిల్ షేర్ ధర రూ.31,510. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gaurav Train, Ganga Pushkaralu, Hyderabad, IRCTC, IRCTC Tourism, Kashi Vishwanath Temple