Home /News /business /

FUTURE RETAIL AMAZON CASE DELHI HC SAYS FRL RELIANCE DEAL IN ACCORDANCE WITH LAWS MK

Future Retail-Amazon case: ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ కు చుక్కెదురు...ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ ఒప్పందం చట్టబద్ధమైనదే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Future Retail-RIL transaction: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ మధ్య ప్రతిపాదిత బిజినెస్ డీల్ ఆమోదించే తీర్మానం భారత చట్టాలకు అనుగుణంగా ఉందని, దీనిలో జోక్యం చేసుకోలేమని అమెజాన్ వాదనను ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దీంతో అమెజాన్ కు పెద్ద ఝలక్ తగిలింది.

ఇంకా చదవండి ...
    Future Retail-RIL transaction: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ మధ్య ప్రతిపాదిత బిజినెస్ డీల్ ఆమోదించే తీర్మానం భారత చట్టాలకు అనుగుణంగా ఉందని, దీనిలో జోక్యం చేసుకోలేమని అమెజాన్ వాదనను ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దీంతో అమెజాన్ కు పెద్ద ఝలక్ తగిలింది. అయితే అమెజాన్ రెగ్యూలేటర్లకు తన వాదనలను వినిపించుకోవచ్చని వెసులు బాటు కల్పించింది. కాగా ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ మధ్య జరిగిన వ్యాపార ఒఫ్పందాన్న అడ్డుకోవాలని చూసిన అమెజాన్ కు ఇది శరాఘాతం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అక్టోబర్‌లో, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లోని (SIAC) ఆర్బిట్రేటర్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ ఆర్మ్‌తో ఒప్పందంలో తదుపరి చర్యలు తీసుకోకుండా ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ను తాత్కాలిక ఉత్తర్వు పరిమితం చేసింది.

    అయితే SIAC అత్యవసర అవార్డు ఉత్తర్వు చెల్లుబాటు అవుతుందని డిసెంబర్ 21 ఢిల్లీ హైకోర్టు ఒక ప్రాథమిక prima facie పరిశీలన చేసింది. అలాగే FRL సూట్ కూడా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించిన ఎఫ్‌ఆర్‌ఎల్ బోర్డు తీర్మానం చెల్లుబాటు అవుతుందని కోర్టు తెలిపింది.

    అలాగే కోర్టు చట్ట బద్ధ సంస్థలకు పరిగణలో ఉన్న చట్టాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. ఇందులో భాగంగా ఎఫ్‌ఆర్‌ఎల్ మరియు అమెజాన్ ఇప్పటికే తమ వాదనలు మరియు కౌంటర్ వాదనలను విని చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.

    ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌లో రిటైల్ అండ్ హోల్‌సేల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. రూ.24,713 కోట్లు చెల్లించి రిలయన్స్ సంస్థ ఫ్రూచర్ గ్రూప్‌ రిటైల్‌ను కైవసం చేసుకుంది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్) కు బదిలీ చేయనుంది. అలాగే ఫ్యూచర్ గ్రూప్‌లోని లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ విభాగాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తుంది. ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్ సంస్థ ఫ్యూచర్ ఎంటర్ (ఎఫ్ఈఎల్) ప్రైజెస్ లిమిటెడ్‌లో రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించింది. ఎఫ్ఈఎల్ ఈక్విటీ వారెంట్స్ మీద మరో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

    Disclaimer: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Amazon, Business, RIL

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు