Budget 2019 : రూ. 5 లక్షల వార్షికాదాయంపై పన్ను మినహాయింపు...

రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 5, 2019, 2:13 PM IST
Budget 2019 : రూ. 5 లక్షల వార్షికాదాయంపై పన్ను మినహాయింపు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 5, 2019, 2:13 PM IST
మధ్యతరగతి వేతన జీవులకు కేంద్రం బడ్జెట్‌ శుభవార్త మిగిల్చింది. రూ.5లక్షల వరకూ వార్షిక ఆదాయాన్ని ఆర్జించే వేతనజీవులకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తరహాలోనే, కేంద్రం తాజా బడ్జెట్‌లో మరోమారు స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది వేతనజీవులు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. అయితే.. రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌చార్జీ, రూ.5 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 7 శాతం సర్‌చార్జీ విధించనున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...