Reliance offers: రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్‌లో 'ఫుల్ పైసా వసూల్' సేల్... ఆఫర్స్ ఇవే

Reliance Full Paisa Vasool Sale | ఐదు రోజుల సేల్‌లో ఇంటికి కావాల్సిన సరుకుల దగ్గర్నుంచి పళ్లు, కూరగాయలు, కిచెన్, హోమ్‌వేర్, ఇతర వస్తువులపై భారీ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: January 23, 2020, 10:32 AM IST
Reliance offers: రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్‌లో 'ఫుల్ పైసా వసూల్' సేల్... ఆఫర్స్ ఇవే
Reliance offers: రిలయన్స్ ఫ్రెష్, స్మార్ట్‌లో 'ఫుల్ పైసా వసూల్' సేల్... ఆఫర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ ఫ్రెష్‌తో పాటు రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లలో 'ఫుల్ పైసా వసూల్' సేల్ మళ్లీ మొదలైంది. జనవరి 22న ప్రారంభమైన సేల్ జనవరి 26న ముగుస్తుంది. దేశంలోని అన్ని రిలయెన్స్ ఫ్రెష్, రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లలో ఈ సేల్ అందుబాటులో ఉంది. ప్రతీ ఏడాది రెండు సార్లు 'ఫుల్ పైసా వసూల్' సేల్ నిర్వహిస్తుంది రిలయెన్స్. 2020 ఏడాది మొదటి సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి భారీ ఆఫర్లతో ఈ సేల్ కస్టమర్లను ఆహ్వానిస్తోంది. ఐదు రోజుల సేల్‌లో ఇంటికి కావాల్సిన సరుకుల దగ్గర్నుంచి పళ్లు, కూరగాయలు, కిచెన్, హోమ్‌వేర్, ఇతర వస్తువులపై భారీ ఆఫర్లున్నాయి.

రిలయెన్స్ ఫ్రెష్‌, రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లలో 'ఫుల్ పైసా వసూల్ గురించి గత కొంతకాలంగా భారీగా ప్రచారం చేస్తోంది కంపెనీ. టీవీ, ప్రింట్, రేడియో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆఫర్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తోంది. దీపికా కక్కర్‌తో పాటు రిలయెన్స్ ఫ్రెష్ అండ్ స్మార్ట్ జీనీతో ప్రచారమవుతున్న యాడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ప్రచారం కొనసాగుతోంది.


మాలాంటి సూపర్‌ మార్కెట్ బ్రాండ్స్ కొన్నేళ్లుగా వినియోగదారుల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. వారి రోజువారీ అవసరాలను తీరుస్తున్నాయి. వారి సంతోషాలు, వేడుకలు, పండుగల్లో మేమూ భాగమైపోయాం. అలాంటి సందర్భాలు మా వినియోగదారులతో మాట్లాడటానికి, వారితో కలవడానికి అవకాశాన్నిస్తున్నాయి.
దామోదర్ మాల్, సీఈఓ, రిలయెన్స్ ఫ్రెష్ అండ్ స్మార్ట్




రిలయెన్స్ ఫ్రెష్, రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లు వేరంగా విస్తరిస్తున్నాయి. రిలయెన్స్ రీటైల్ ప్రస్తుతం 700 ఫ్రెష్, స్మార్ట్ స్టోర్లను నిర్వహిస్తున్నాయి. పెద్దపెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.ఇవి కూడా చదవండి:

Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్

Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు