పండుగ వేళ ప్రజలపై కనికరం..పెట్రో ధరల తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు స్వల్పంగా తగ్గించడం విశేషం.

news18-telugu
Updated: October 18, 2018, 2:32 PM IST
పండుగ వేళ ప్రజలపై కనికరం..పెట్రో ధరల తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
యావత్ భారతావని దసరా సంబరాల్లో మునిగితేలుతున్న వేళ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రజలపై కాస్త కనికరం చూపాయి. గత 12 రోజులుగా పెంచుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. దిల్లీ, కోల్‌కత్తా, ముంబైలో లీటర్ పెట్రోల్‌పై 21 పైసలు తగ్గించగా...చెన్నైలో 22 పైసలు తగ్గించారు. లీటరు పెట్రోల్ దిల్లీలో రూ.82.62, కోల్‌కత్తాలో రూ.84.44, ముంబైలో రూ.88.08, చెన్నైలో రూ.85.88గా ఉంది

అటు డీజిల్‌ ధరలను కూడా ప్రధాన మెట్రో నగరాల్లో 11 పైసలు మేర తగ్గించారు. లీటరు డీజిల్ దిల్లీలో రూ.75.58, కోల్‌కత్తాలో రూ.77.43, ముంబైలో రూ.79.24, చెన్నైలో రూ.79.93గా ఉంది. తగ్గించిన ధరలు గురువారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి.

ఇటు హైదరాబాద్‌లోనూ 22 పైసలు తగ్గించడంతో లీటరు పెట్రోల్‌ రూ.87.59గా ఉంది. బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.87.81గా ఉంది. అటు డీజిల్ ధర 12 పైసలు తగ్గి లీటరు రూ.82.21గా ఉంది. లీటరు డీజిల్ బుధవారం రూ.82.33గా ఉంది.


అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు స్వల్పంగా తగ్గించడం విశేషం. ప్రజల్లో పండుగ జోష్‌ను పెంచే ఉద్దేశంతోనూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించినట్లు తెలుస్తోంది.
First published: October 18, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...