Petrol Price | వాహనదారులకు తీపికబురు అందనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వచ్చే అవకాశం ఉందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude) ధరలు భారీగా దిగి వచ్చాయి. దీంతో రానున్న కాలంలో దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు సోమవారం రోజున ఏకంగా జనవరి నెల నాటి కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యారెల్కు 2.6 డాలర్ల మేర దిగి వచ్చింది. 3 శాతం తగ్గుదలతో 80 డాలర్లకు క్షీణించింది. మార్చి నెలలో క్రూడ్ ఆయిల్ రేటు 112 డాలర్ల పైకి చేరిన విషయం తెలిసిందే. అంటే అక్కడి నుంచి చూస్తే.. క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు.
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!
గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చనే అంచనాలు పెరిగాయి. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ మారాల్సి ఉంది. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం చాలా నెలల నుంచి ఫ్యూయెల్ రేట్లను మార్చడం లేదు. స్థిరంగానే కొనసాగిస్తూ వస్తున్నాయి. ఒకవేళ ఫ్యూయెల్పై రేట్లు తగ్గితే మే 22 నుంచి ధరలు తగ్గడం ఇదే తొలిసారి అవుతుంది.
ఏటీఎం కార్డు ఉంటే ఉచితంగా రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. వివరాలు ఇలా!
ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 109.64 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ.97.8 వద్ద కొనసాగుతోంది. వరంగల్లో పెట్రోల్ ధర రూ. 109.14 వద్ద ఉంది. డీజిల్ రేటును గమనిస్తే.. రూ. 97.33 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో ఫ్యూయెల్ రేట్లను గమనిస్తే.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.46 వద్ద ఉంది. డీజిల్ రేటు అయితే రూ. 98.25 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 111.74గా, రూ. 99.49గా ఉన్నాయి. కర్నూల్లో గమనిస్తే.. పెట్రోల్ రేటు రూ. 112.1 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రేటు రూ. 99.83 వద్ద ఉంది. కడపలో పెట్రోల్ కొనాలంటే లీటరుకు రూ. 110.68 చెల్లించుకోవాలి. డీజిల్ కోసం రూ. 98.48 ఇవ్వాలి. మరో వైపు దేశంలో పలు ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. దీని వల్ల ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crude Oil, Diesel price, Diesel rate, Petrol Price, Petrol rate