హోమ్ /వార్తలు /బిజినెస్ /

Flight Tickets: పండుగ సీజన్ లో విమానంలో ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా..? అదిరిపోయే న్యూస్ మీ కోసమే..

Flight Tickets: పండుగ సీజన్ లో విమానంలో ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా..? అదిరిపోయే న్యూస్ మీ కోసమే..

Flight Tickets: పండుగ సీజన్ లో విమానంలో ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా..? అదిరిపోయే న్యూస్ మీ కోసమే..

Flight Tickets: పండుగ సీజన్ లో విమానంలో ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా..? అదిరిపోయే న్యూస్ మీ కోసమే..

Flight Tickets: సుమారు 27 నెలల వ్యవధి తర్వాత, డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై విధించిన పరిమితులను ఆగస్టు 31 నుంచి తొలగిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో తెలియజేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పండుగ సీజన్‌లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ శుభవార్త మీకోసమే. ఆగస్టు 31 నుంచి డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై (Domestic Airfares) ప్రభుత్వం ధరల పరిమితులను తొలగిస్తోంది. ఇది ప్రయాణికుల ఛార్జీలను నిర్ణయించడంపై విమానయాన సంస్థలకు వెసులుబాటును ఇస్తుంది. సుమారు 27 నెలల వ్యవధి తర్వాత, డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై విధించిన పరిమితులను ఆగస్టు 31 నుంచి తొలగిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ (Union Aviation Ministry) ఈ నెల ప్రారంభంలో తెలియజేసింది.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. ‘ప్రస్తుత షెడ్యూల్డ్‌ డొమెస్టిక్‌ ఆపరేషన్స్‌ స్టేటస్‌ను సమీక్షించిన తర్వాత, విమాన ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించవచ్చు. 2022 ఆగస్టు 31 నుంచి అమల్లోకి వచ్చేలా విమాన ఛార్జీలకు సంబంధించి ఎప్పటికప్పుడు నోటిఫై చేసిన ఫేర్ బ్యాండ్‌లను తీసివేయాలి.’ అని పేర్కొంది.
* డొమెస్టిక్‌ విమాన ఛార్జీలు తగ్గుతాయా?
ఆగస్టు 31 నుంచి, ఇకపై ఎటువంటి ధరల పరిమితులు లేవు కాబట్టి, విమానయాన సంస్థలు ప్రయాణికులకు సరిపోతుందని భావించిన ఛార్జీలను వసూలు చేయవచ్చు. ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు విమాన టిక్కెట్ ధరలపై డిస్కౌంట్‌లను అందించవచ్చు. గతంలో, డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై ప్రభుత్వం విధించిన పరిమితుల ఆధారంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్లను అందించలేకపోయాయి.


* డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై పరిమితిని ఎందుకు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది?
దీనికి సంబంధించి విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ట్వీట్‌లో.. ‘ఎయిర్‌ టర్బైన్ ఫ్యూయల్‌(ATF) రోజువారీ డిమాండ్, ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత విమాన ఛార్జీల పరిమితులను తొలగించే నిర్ణయం తీసుకున్నాం.
స్టెబిలేషన్‌ ప్రారంభమైంది, సమీప భవిష్యత్తులో డొమెస్టిక్‌ ట్రాఫిక్‌లో వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని కచ్చితంగా భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ప్రధానంగా ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని వారాలుగా ATF ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత తగ్గుతున్నాయి.
ఇది కూడా చదవండి : రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ అమ్మకంపై పన్ను ఆదా చేయడం ఎలాగో తెలుసుకోండి..!
* గతంలో ప్రభుత్వం పరిమితులను విధించింది?
దేశవ్యాప్తంగా కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత విమాన ప్రయాణం పునఃప్రారంభం కావడంతో మే 2020లో డొమెస్టిక్‌ విమాన ఛార్జీలపై ప్రభుత్వం మినిమం, మ్యాక్సిమం పరిమితులను విధించింది. 2021 అక్టోబర్ లో ప్రభుత్వం 100 శాతం కెపాసిటీ డెప్లాయ్‌మెంట్‌కు అనుమతించినప్పటికీ, ధరల నియంత్రణను కొనసాగించింది.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎయిర్‌లైన్స్‌ను రక్షించడానికి దిగువ క్యాప్‌లు, అధిక ఛార్జీల నుంచి ప్రయాణికులను రక్షించడానికి ఎగువ క్యాప్‌లు ఉన్నాయి. ఉదాహరణకు, విమానయాన సంస్థలు ప్రస్తుతం 40 నిమిషాల కంటే తక్కువ సమయం ప్రయాణించే వాటికి రూ.2,900 కంటే తక్కువ (GST మినహా), రూ.8,800 (GST మినహా) కంటే ఎక్కువ వసూలు చేయవు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Aviation, Central Government, Flight Offers, Flight tickets, National News

ఉత్తమ కథలు