హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా? బ్యాంకుల వారీగా సింగిల్, డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ తెలుసుకోండి..

UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా? బ్యాంకుల వారీగా సింగిల్, డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ సంస్థలు యూపీఐ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఒక్కో కస్టమర్‌కు రూ.2 లక్షలుగా నిర్ణయించాయి. అయితే మినిమం వ్యాల్యూ అనేది ఏదీ సెట్ చేయలేదు కాబట్టి తక్కువ డబ్బును సైతం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

UPI Transactions Limit: బ్యాంకింగ్ సేవల్లో(Banking Services) డిజిటల్ టెక్నాలజీ వాడకం పెరిగిపోయిన తర్వాత ఎక్కువగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు(Cashless Transactions) జరుగుతున్నాయి. ప్రజలు స్మార్ట్‌ఫోన్ల ద్వారా సింగల్ క్లిక్‌తో డిజిటల్ ట్రాన్సాక్షన్లు(Digital Transactions) చేసేందుకు అలవాటు పడుతున్నారు. ఈ ఏడాది ఒక్క ఆగస్టు నెలలోనే ప్రముఖ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ఏకంగా 657 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. దీన్నిబట్టి డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగాయో, యూపీఐ డిజిటల్ పేమెంట్ మెథడ్ ఎంతగా పాపులర్ అయిందో స్పష్టంగా తెలుస్తోంది.

ఆగస్టు నెలలో జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్ గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా వెల్లడించింది. ఆ డేటా ప్రకారం మంత్లీ (Month-over-month) యూపీఐ ట్రాన్సాక్షన్లు వాల్యూమ్ పరంగా 4.6 శాతం, వాల్యూ పరంగా 1 శాతం పెరిగాయి. యూపీఐ వాడకం ఊహించని రీతిలో వృద్ధిని నమోదు చేయడానికి ప్రధాన కారణం అది ఎలాంటి అవాంతరాలు లేని పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించడమేనని చెప్పవచ్చు. మరి వివిధ రకాల బ్యాంకులు డైలీ యూపీఐ (UPI) ట్రాన్సాక్షన్ లిమిట్, సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎలా నిర్ణయించాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్

ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ సంస్థలు యూపీఐ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఒక్కో కస్టమర్‌కు రూ.2 లక్షలుగా నిర్ణయించాయి. అయితే మినిమం వ్యాల్యూ అనేది ఏదీ సెట్ చేయలేదు కాబట్టి తక్కువ డబ్బును సైతం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎన్‌పీసీఐ ప్రకారం, బ్యాంకులు తమ సొంత యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ సెట్ చేసుకోవచ్చు.

Tax Benefits : ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్..ఈ రూల్స్ పాటించకపోతే ఆదాయ పన్ను ప్రయోజనాలు రద్దు!

బ్యాంక్స్‌, యూపీఐ సింగిల్ ట్రాన్సాక్షన్ & డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్స్‌

- ఎస్‌బీఐ , ఆంధ్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, సిటీ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంకులు తమ కస్టమర్లకు సింగిల్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.1 లక్ష.. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1 లక్షగా నిర్ణయించాయి.

- ఐసీఐసీఐ బ్యాంక్ సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.10 వేలు (గూగుల్ పే యూజర్లకు రూ.25 వేలు).. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు (గూగుల్ పే యూజర్లకు రూ.25 వేలు)గా సెట్ చేసింది.

- కెనరా బ్యాంక్ సింగిల్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు.. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.25 వేలు

- బ్యాంక్ ఆఫ్ బరోడా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.25 వేలు లక్ష.. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1 లక్ష

- బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.10 వేలు.. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1 లక్ష

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగిల్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.25 వేలు.. డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.50 వేలు

యూపీఐ ఎలా పని చేస్తుంది?

యూపీఐలో వర్చువల్ పేమెంట్ అడ్రస్‌ను (VPA) సెట్ చేసి మనీ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ సిస్టమ్‌ ద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్ యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్‌ లింక్ చేయవచ్చు. IFSC కోడ్ లేదా అకౌంట్ నంబర్‌ అందించి క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. BHIM UPI యాప్‌తో పాటు PhonePe, Paytm, గూగుల్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ఉపయోగించి యూపీఐ ట్రాన్సాక్షన్లు జరపొచ్చు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Banks, UPI, Upi payments

ఉత్తమ కథలు