హోమ్ /వార్తలు /బిజినెస్ /

Luxury Bikes: సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు.. స్టార్స్ దగ్గర ఉన్న హై రేంజ్ లగ్జరీ బైక్స్ ఇవే..

Luxury Bikes: సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు.. స్టార్స్ దగ్గర ఉన్న హై రేంజ్ లగ్జరీ బైక్స్ ఇవే..

Photo Credit : Akshay Kumar Instagram

Photo Credit : Akshay Kumar Instagram

Luxury Bikes: సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు.. చాలామంది స్టార్స్ దగ్గర పాపులర్ బైక్స్ ఉన్నాయి. అవేంటి, వాటి ధర ఎంత, కెపాసిటీ ఎలా ఉంటుంది..? వంటి వివరాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మనకు తెలిసిన లగ్జరీ బైక్స్‌ (Luxury Bikes) చాలావరకు సినిమాల్లోనే కనిపిస్తాయి. లేదంటే కోటీశ్వరుల ఇళ్లలో అవి దర్శనమిస్తాయి. ఇలాంటి బైక్స్‌ను కొనడం, మెయింటెన్ చేయడం అందరికీ సాధ్యంకాదు. ఎందుకంటే వాటి ధర రూ.లక్షల్లో ఉంటుంది. అయితే ఇలాంటి హై రేంజ్ బైక్స్‌ (High Range Bikes) నడుపుతూ చాలాసార్లు కనిపించారు బాలీవుడ్ హీరోలు. సల్మాన్ ఖాన్ (Salman Khan) నుంచి అక్షయ్ కుమార్ (Akshay Kumar) వరకు.. చాలామంది స్టార్స్ దగ్గర పాపులర్ బైక్స్ ఉన్నాయి. అవేంటి, వాటి ధర ఎంత, కెపాసిటీ ఎలా ఉంటుంది..? వంటి వివరాలు తెలుసుకుందాం.


* సల్మాన్ ఖాన్
ప్రీమియం బైక్స్‌ అంటే సల్మాన్ ఖాన్‌కు ఎంతో ఇష్టం. ఈ సీనియర్ హీరో సూపర్‌బైక్‌లపై బాంద్రా ఏరియాలో షికారు చేస్తూ తరచుగా కనిపిస్తాడు. సల్మాన్ దగ్గర యమహా R1 (Yamaha R1) లగ్జరీ బైక్ ఉంది. ఇండియాలో దీని ధర రూ. 21 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 998 cc ఇన్‌లైన్ 4-సిలిండర్‌ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 179 హార్స్‌పవర్, 115 Nm టార్క్‌ను అందిస్తుంది.* అక్షయ్ కుమార్

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ వద్ద యమహా వీమ్యాక్స్ (Yamaha Vmax) లగ్జరీ బైక్ ఉంది. 2020లో ఈ బైక్ ప్రొడక్షన్ ఇండియాలో ఆపేశారు. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 32 లక్షల కంటే ఎక్కువ. ఈ బైక్ 1679cc V4 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 6500 RPM వద్ద 167 Nm గరిష్ట టార్క్, 9000 RPM వద్ద 200 హార్స్‌పవర్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 220 కి.మీ.

View this post on Instagram


A post shared by Akshay Kumar (@akshaykumar)


* జాన్ అబ్రహం

ధూమ్ సినిమాలో హీరో జాన్ అబ్రహం సుజుకి హయాబుసా బైక్‌ను రైడ్ చేయడం చాలామంది బైక్ లవర్స్‌కు గుర్తుండే ఉంటుంది. అయితే రియల్ లైఫ్‌లో కూడా జాన్ సూపర్ బైక్స్‌ను ఇష్టపడతాడు. అతడి బైక్ కలెక్షన్స్‌లో హయబుసా, యమహా YZF R1తో పాటు 16 ఇతర మోడళ్లు ఉన్నాయి. ఇండియాలో రూ.25 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న డుకాటి పానిగేల్ V4 (Ducati Panigale V4).. జాన్ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన బైక్. ఇది భారీ 1.1-లీటర్ 4-సిలిండర్‌తో ప్యాక్ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ 215 హార్స్‌పవర్, 123 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.* విద్యుత్ జమ్వాల్

ఈ యాక్టర్ వద్ద ట్రయంఫ్ రాకెట్ 3 (Triumph Rocket 3) సూపర్ బైక్ ఉంది. దీని ధర రూ. 20 లక్షలు. ట్రయంఫ్ రాకెట్ 3 బైక్ భారీ 2458cc ఇంజిన్‌తో వస్తుంది. ఇది 165 hp పవర్‌ను, 221 Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు.* షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ గ్యారేజీలో ఉన్న సూపర్ బైక్స్‌లో BMW R1250GS అడ్వెంచర్‌ హై ఎండ్ మోడల్. దీని ధర రూ. 18.25 లక్షలు. ఈ బైక్ ఇంజిన 7750 rpm వద్ద 136 PS పవర్‌ను అందించగలదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Akshay Kumar, Bikes, Bollywood news, Salman khan, Shahid Kapoor

ఉత్తమ కథలు