Home /News /business /

FROM NOW ON YOU MUST HAVE AN AADHAAR NUMBER OR ENROLMENT SLIP TO AVAIL GOVERNMENT SUBSIDIES AND BENEFITS GH SRD

Exclusive: బీ అలర్ట్.. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలను పొందాలంటే అది తప్పనిసరి.. ఇప్పటి నుంచే..

Aadhaar number

Aadhaar number

Exclusive: ఆధార్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ UIDAI ఆగస్టు 11న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ నంబర్ పొందని వ్యక్తికి ప్రయోజనాలు, రాయితీలు, సేవలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించాలని ఆధార్ చట్టంలోని సెక్షన్ 7లో నిబంధన సూచిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇప్పటి నుంచి ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ నంబర్ (Aadhaar Number) లేదా ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌ కచ్చితంగా ఉండాలి. ఈ మేరకు గత వారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) సర్క్యులర్‌ పంపింది. ఆధార్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ UIDAI ఆగస్టు 11న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ నంబర్ పొందని వ్యక్తికి ప్రయోజనాలు, రాయితీలు, సేవలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించాలని ఆధార్ చట్టంలోని సెక్షన్ 7లో నిబంధన సూచిస్తోంది. దేశంలోని 99 శాతానికి పైగా వయోజనులకు ఆధార్ నంబర్ జారీ చేసినట్లు తాజా సర్క్యులర్ చెబుతోంది.

సర్క్యులర్‌లో వివరాలు..‘చట్టంలోని సెక్షన్ 7లోని నిబంధనను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక వ్యక్తికి ఆధార్ నంబర్ కేటాయించకపోతే.. అతను/ఆమె ఎన్‌రోల్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలి. అలాంటి వ్యక్తికి ఆధార్ నంబర్ కేటాయించే వరకు, అతను/ఆమె ప్రయోజనాలు, సబ్సిడీలు, సేవలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్(EID) నంబర్/స్లిప్‌తో పాటు ప్రత్యామ్నాయ గుర్తింపు మార్గాల ద్వారా పొందవచ్చు’ అని సర్క్యులర్ పేర్కొంది.



దీనర్థం ఒక వ్యక్తికి ఇంకా ఆధార్ నంబర్ లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు, సబ్సిడీలను పొందేందుకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ (EID) నంబర్/స్లిప్ అవసరం.

* 99 శాతం మందికి ఆధార్‌
99 శాతం మంది పెద్దలకు ఆధార్‌ నంబర్‌లను కేటాయించారు. దాదాపు అందరికీ ఆధార్‌ నంబర్‌లు ఉన్నాయని అనేక సేవలు, ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందుతాయని సర్క్యులర్ పేర్కొంది. సంక్షేమ సేవలను పౌరులకు అందించడంలో నాణ్యతను ఆధార్ గణనీయంగా మెరుగుపరిచిందని సర్క్యులర్ పేర్కొంది.

UIDAI తాజా డేటా ప్రకారం.. 95.74 లక్షల ఆధార్ నంబర్లు పెద్దలకు కేటాయించారు. ఇది 2022 నాటికి భారతదేశంలోని వయోజన జనాభాలో దాదాపు 101 శాతం. ప్రభుత్వంలో లీకేజీలను అరికట్టడానికి ఆధార్ ప్రధాన సాధనంగా పరిగణించబడుతుంది.

* వర్చువల్ ఐడెంటిఫైయర్ (VID) ఆప్షనల్
UIDAI ఇంతకుముందు ప్రజలకు వర్చువల్ ఐడెంటిఫైయర్ (VID) అందజేసింది. ఇది సంబంధిత వ్యక్తికి భద్రత అందించే మ్యాప్ చేసిన ఇంటర్‌ ఛేంజబుల్ 16-అంకెల సంఖ్య. ఆన్‌లైన్ అథెంటికేషన్‌, లేదా e-KYC కోసం ఆధార్ నంబర్‌కి బదులుగా ఈ VIDని ఉపయోగించవచ్చని నిబంధనలు పేర్కొన్నాయి. వర్చువల్ IDని ఉపయోగించి ఆధార్ అథెంటికేషన్‌ చేయవచ్చని సంస్థలు నిర్ధారించుకోవాలి.

ఇది కూడా చదవండి : Aadhaar Card: మీ మొబైల్ నెంబర్‌తో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

అయితే ఆగస్టు 11న జారీ చేసిన రెండవ సర్క్యులర్‌లో.. ప్రభుత్వ సంస్థలు VIDని ఆప్షనల్‌గా చేయవచ్చని UIDAI పేర్కొంది. సాంఘిక సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఆధార్ నంబర్ అవసరం కావచ్చని, అందువల్ల, అటువంటి ప్రభుత్వ సంస్థలు లబ్ధిదారులకు ఆధార్ నంబర్‌లను అందించాల్సి ఉంటుందని, VID ఆప్షనల్ అని తెలిపింది.

* సర్టిఫికేట్‌లకు కూడా ఆధార్
ఆగస్టు 11న జారీ చేసిన మరో సర్క్యులర్‌లో.. UIDAI కూడా వివిధ సర్టిఫికేట్‌ల జారీకి ఆధార్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ అవసరం కావచ్చునని పేర్కొంది. ఇవి నిధులు అందించే పథకాల కింద ప్రయోజనాలు, రాయితీలు, సేవలను అందించడానికి లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడానికి ఉపయోగించబడతాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Aadhaar Card, AADHAR, Central Government, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు