హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI Payments Vision: ఫ్యూచర్ పేమెంట్ సిస్టమ్స్‌పై ఆర్బీఐ ఫోకస్.. RBI పేమెంట్స్‌ విజన్- 2025లో కీలక అంశాలు

RBI Payments Vision: ఫ్యూచర్ పేమెంట్ సిస్టమ్స్‌పై ఆర్బీఐ ఫోకస్.. RBI పేమెంట్స్‌ విజన్- 2025లో కీలక అంశాలు

ఫ్యూచర్ పేమెంట్స్‌పై ఆర్బీఐ ఫోకస్. (Photo: ShutterStock)

ఫ్యూచర్ పేమెంట్స్‌పై ఆర్బీఐ ఫోకస్. (Photo: ShutterStock)

దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించి అమలు చేయనున్న విధానాలపై ఆర్‌బీఐ(RBI) స్పష్టత ఇచ్చింది. వివిధ రకాల ఇన్నొవేటివ్‌ పేమెంట్ సిస్టమ్స్‌, పెద్ద ఫిన్‌-టెక్‌ కంపెనీలు, బయ్‌- నౌ- పే లేటర్‌ సిస్టమ్‌ నియంత్రణ, సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(CBDT)ను ప?

ఇంకా చదవండి ...

దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించి అమలు చేయనున్న విధానాలపై ఆర్‌బీఐ(RBI) స్పష్టత ఇచ్చింది. వివిధ రకాల ఇన్నొవేటివ్‌ పేమెంట్ సిస్టమ్స్‌, పెద్ద ఫిన్‌-టెక్‌ కంపెనీలు, బయ్‌- నౌ- పే లేటర్‌ సిస్టమ్‌ నియంత్రణ, సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(CBDT)ను ప్రవేశపెట్టడం వంటి కీలక అంశాల గురించి రిజర్వ్ బ్యాంక్ వివరించింది.

పేమెంట్స్‌ విజన్‌ 2025 ప్రకటన

జూన్ 17న విడుదలైన పేమెంట్స్ విజన్ 2025 డాక్యుమెంట్‌లో ఆర్‌బీఐ..‘ఎప్పుడైనా, ఎక్కడైనా వినియోగదారులు సులువుగా పేమెంట్‌ సిస్టమ్‌లను వినియోగించుకునేందుకు, అందరికీ పేమెంట్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉండేందుకు వ్యవస్థను అభివృద్ధి చేయనున్నాం. ప్రతి వినియోగదారునికి సురక్షితమైన, చౌకైన ఇ-పేమెంట్ ఆప్షన్‌లు అందించడం ప్రధాన ఉద్దేశం. పేమెంట్స్ విజన్ 2025 అనేది ఇ-పేమెంట్స్‌, ఎవ్రీవన్, ఎవ్రీవేర్, ఎవ్రీటైమ్ (4Eలు) అనే ప్రధాన థీమ్‌పై పని చేస్తుంది. ప్రతి కస్టమర్‌కు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన, ఆఫర్డ్‌బుల్‌ ఇ-పేమెంట్స్‌ ఆప్షన్‌లు అందించడం ప్రధాన లక్ష్యం’ అని పేర్కొంది.

ఇప్పటి నుంచి 2025వ సంవత్సరం మధ్య కాలంలో చేపట్టబోయే కార్యకలాపాలను సెంట్రల్‌ బ్యాంక్‌ వివరించింది. ఇంటిగ్రిటీ (Integrity), ఇన్‌క్లూజివిటీ (Inclusivity), ఇన్నొవేషన్‌ (Innovation), ఇన్‌స్టిటూషనలైజేషన్‌ (Institutionalisation), ఇంటెర్నేషనలైజేషన్‌ (Internationalisation) అనే ఐదు కీలక లక్ష్యాలపై పని చేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ఎక్కువ డేటా వాడేవారికి Vodafone Idea గుడ్ న్యూస్.. ఏకంగా 3.5GB డైలీ డేటా.. ప్లాన్ వివరాలివే


మరో పది లక్ష్యాలు..

2025లోగా సాధించాల్సిన మరో పది లక్ష్యాలను ఆర్‌బీఐ తెలియజేసింది. అందులో డిజిటల్ పేమెంట్‌ ట్రాన్సాక్షన్‌లను మూడు రెట్లు పెంచడం, UPIలలో 50 శాతం వార్షిక వృద్ధి సాధించడం, ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (IMPS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), క్రెడిట్‌ కార్డుల కంటే డెబిట్ కార్డుల వినియోగాన్ని 20 శాతం పెంచడం వంటి ఇతర లక్ష్యాలను సాధించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

rbi ప్రపోజ్‌ చేసిన ఇతర అంశాల్లో వన్ నేషన్ వన్ గ్రిడ్ క్లియరింగ్, సెటిల్‌మెంట్‌, చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS) అభివృద్ధి, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌ ఉపయోగించి ఆన్‌లైన్ బిజినెస్‌ పేమెంట్స్‌ను ప్రాసెస్ చేయడానికి పేమెంట్‌ సిస్టమ్‌ రూపొందించడం వంటివి ఉన్నాయి. బిగ్‌టెక్‌లు , ఫిన్‌టెక్‌ల నియంత్రణపై కూడా దృష్టి పెట్టనున్నట్లు ఆర్‌బీఐ సూచించింది.

బిగ్‌టెక్‌లు, ఫిన్‌టెక్‌లు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ముందున్నాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ పేర్కొంది. పేమెంట్‌ సిస్టమ్‌లో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, డొమెస్టిక్‌ ఇన్‌కార్పొరేషన్, రిపోర్టింగ్, డేటా వినియోగం మొదలైనవాటిని పబ్లిష్‌ చేయాలని భావిస్తోంది. కార్డ్‌లు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సంప్రదాయ చెల్లింపు పద్ధతులను దాటి బయ్‌-నౌ-పే లేటర్‌(BNPL) సేవలు కొత్త పేమెంట్‌ సిస్టమ్‌గా అభివృద్ధి చెందిందని తెలిపింది. BNPLకు సంబంధించిన చెల్లింపులపై అవసరమైన సిఫార్సులను జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: నిద్రలో ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా..? మీ లైఫ్ టర్న్ అయినట్లే.. ఏం జరుగుతుందో తెలుసా?


క్రిప్టో కరెన్సీ ప్రవేశపెట్టేందుకు చర్యలు

భారతదేశంలో క్రిప్టోకరెన్సీలపై పరిమితులపై తరచుగా మాట్లాడుతున్న rbi.. దేశంలో క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. క్రిప్టోకరెన్సీ సామర్థ్యాన్ని పెంచడానికి అన్ని రకాల అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

మార్కెట్ ట్రేడింగ్ , సెటిల్‌మెంట్ అవర్స్‌ విస్తరణను కూడా ఆర్‌బీఐ ప్రోత్సహిస్తోంది. మనీ, క్యాపిటల్ మార్కెట్‌లు ఇప్పుడు పని గంటలను పాటిస్తున్నాయి. అయితే ఈ మార్కెట్‌లలో సెటిల్‌మెంట్‌లను అనుమతించే RTGS, NEFT పేమెంట్ సిస్టమ్స్ రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. దీంతో పేమెంట్‌ సిస్టమ్‌ల లభ్యతను ప్రభావితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ సంబంధిత మార్కెట్ విభాగాల సహకారంతో ట్రేడింగ్, సెటిల్‌మెంట్ కోసం ఎక్కువ కాలం మార్కెట్ అందుబాటులో ఉండేలా చేయడానికి ఈ మార్కెట్ ట్రేడింగ్ గంటలను పొడిగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది. ఇది మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అభిప్రాయపడింది.

అంతేకాకుండా online paymentsను ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ప్రాసెస్ చేయడానికి అనుమతించే పేమెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆర్‌బీఐ పని చేయనుంది. ప్రస్తుతం పేమెంట్ గేట్‌వేలు లేదా పేమెంట్ అగ్రిగేటర్‌లు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే అన్ని మర్చంట్‌ పేమెంట్‌ ట్రాన్సాక్షన్‌లను ప్రాసెస్ చేస్తాయని సెంట్రల్ బ్యాంక్ వివరించింది. ఈ విధానం ద్వారా మర్చంట్‌ సెటిల్‌మెంట్‌లలో ఆలస్యం ఏర్పడుతోందని, కాబట్టి ఈ ట్రాన్‌సాక్షన్‌లు అన్నీ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.

First published:

Tags: BUSINESS NEWS, Online payments, Rbi, UPI

ఉత్తమ కథలు