FROM APRIL 1 YOU CANNOT HIDE THESE TRANSACTIONS FROM INCOME TAX DEPARTMENT REGARDING TRADING OF SHARES AK GH
Shares Business: షేర్ వ్యాపారం చేస్తున్నారా ? ఏప్రిల్ 1 నుంచి ఐటీ శాఖ ఇవన్నీ తెలుసుకుంటుంది.. ఈ లావాదేవీలను ఇకపై మీరు దాచలేరు..
ప్రతీకాత్మక చిత్రం
Shares Business: 2021 ఏప్రిల్ 1 నుంచి మీ షేర్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు, డివిడెండ్ ఆదాయంతో పాటు పోస్టాఫీస్ డిపాజిట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో చేసే డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ సమాచారాన్ని కూడా ఐటీ శాఖ తెలుసుకుంటుంది.
మీరు జీతం తీసుకునే ఉద్యోగులా? రెగ్యులర్ గా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే కొంత ఆదాయాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుంకంటే మీరు నిర్వహించే ఈ లావాదేవీలకు చెందిన పన్ను నుంచి ఇకపై తప్పించుకోలేరు. చాలా మంది పన్నులు కట్టకుండా వదిలేయడమో, క్యాపిటల్ గేయిన్ లేదా లాస్ కు సంబంధించిన సమస్యలకు భయపడి లేదా ఐటీఆర్-1 కంటే క్లిష్టమైన ఐటీఆర్ ఫారమ్ ను దాఖలు చేయాలనే భయంతో వీటిని పన్ను పరిధిలో చూపించరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి లావాదేవీల కోసం ఫామ్ 24ఏఎస్ ను తీసుకురానుంది.
2021 ఏప్రిల్ 1 నుంచి మీ షేర్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు, డివిడెండ్ ఆదాయంతో పాటు పోస్టాఫీస్ డిపాజిట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో చేసే డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ సమాచారాన్ని కూడా ఐటీ శాఖ తెలుసుకుంటుంది. ఫారం 26ఏఎస్ రూపంలో ఈ లావాదేవీలన్నీ కనిపిస్తాయి.
ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని మీ బ్రోకర్ లేదా ఏఎంసీ లేదా పోస్టాఫీసు నుంచి నేరుగా పొందుతుంది. కాబట్టి పన్ను ఎగవేతదారులకు ఈ ఆదాయాలను దాచిపెట్టడం ఇకపై కష్టమవుతుంది. ఇప్పటివరకు ఐటీఆర్ ఫారాలు పన్ను చెల్లింపుదారులకు పేరు, చిరునామా, బ్యాంక్, వివరాలు, పన్ను చెల్లింపు, టీడీఎస్ మొదలైన వివరాలను ఆటోమేటిక్ చేయడానికి అనుమతించాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో.. ఐటీఆర్ ఫారమ్ లు ఇప్పుడు లిస్టెడ్ సెక్యూరుటీల నుంచి క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ రాబడి, బ్యాంకుల వడ్డీ, పోస్టాఫీసు మొదలైన వివరాలతో ముందే నింపబడతాయి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిటర్న్ ఫైలింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకుగాను దీన్ని తీసుకువచ్చారు.
ఈ ప్రతిపాదనలను సమర్థవంతంగా చేయడానికి 2021 మార్చి 12న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.. ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం-1961లోని 285 బీఏ ప్రకారం ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ ఇవ్వడానికి నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులు అవసరమని ఇందులో పేర్కొంది. ఇందులో లిస్టెడ్ సెక్యురిటీలు లేదా మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలు, డివిడెండ్ రాబడి, వడ్డీ ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ సంబంధించిన సమాచారం ఉంటుంది.
అలాంటి లావాదేవీలు నివేదించడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, డిపాజిటరీలు, గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పోరేషన్, ఐపీఓకు రిజిస్ట్రార్, షేర్ ట్రాన్సఫర్ ఏజెంట్లు, డివిడెండ్ పంపిణీ చేసే కంపెనీలు, బ్యాంకు చట్టాల కింద బ్యాంకింగ్ కంపెనీలు లేదా కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీస్ చట్టం 1898, ఎన్బీఎఫ్సీల కింద నిర్వించారు. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి వార్షిక సమాచార స్టేట్మెంట్(ఏఐఎస్)లోని డేటా విస్తృత కవరేజి కారణంగా పన్ను చెల్లింపుదారుడు ఇందులో పేర్కొన్ని అన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలను నిర్ధారించాల్సిన అవసరముంది. ఇది ఎగవేయాలనే చూసినట్లయితే పన్ను చెల్లింపుదారుడికి తీవ్రమైన జరినామా విధించవచ్చనే నిపుణులు అంటున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.