హోమ్ /వార్తలు /బిజినెస్ /

Success Story : ఎయిర్ పోర్ట్ క్లీనర్ టు సీఈవో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత కుర్రాడి విజయగాథ.. ఇది కదా సక్సెస్ అంటే..

Success Story : ఎయిర్ పోర్ట్ క్లీనర్ టు సీఈవో.. ఆస్ట్రేలియా గడ్డపై భారత కుర్రాడి విజయగాథ.. ఇది కదా సక్సెస్ అంటే..

Aamir Qutub (Photo Credit : Instagram)

Aamir Qutub (Photo Credit : Instagram)

Success Story: ప్రతి సక్సెస్‌ స్టోరీ సెలెబ్రిటీలదే ఎందుకు కావాలి? స్ఫూర్తినిచ్చే సామాన్యుడి కథ అయినా కావచ్చు. ఎత్తుపల్లాలు, మలుపులు, గెలుపులు సినిమా కథల్లోనేనా? చుట్టూ ఉన్న జీవితాల్లోనూ కనిపించొచ్చు. అలాంటిదే.. ఈ భారత కుర్రాడి సక్సెస్ స్టోరీ.

ఇంకా చదవండి ...

డబ్బు సంపాదిచండం ఎలా? అందరూ దీని గురించే ఆలోచిస్తారు. డబ్బు సంపాదించడం (Money Earning) చాలా కష్టమని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే... డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అప్పుడే డబ్బు చాలా సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది. కొంత మంది జీవితాంతం ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. కానీ ఆర్థికంగా నిలుదొక్కుకోలేరు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నెలనెలా స్థిరమైన ఆదాయం పొందతూ బతుకు బండిని నెట్టుకొస్తుంటారు. కానీ ఇంకొంత మంది ఉంటారు. వారు చిన్న వయసులోనే రిస్క్ చేస్తుంటారు. ఎన్నో కష్టాలు, వాటి తాలుకూ ఎదురు దెబ్బలు తింటారు. కొత్తగా ప్రయత్నించి సక్సెస్ అవుతుంటారు. ఎవరూ ఊహించనంతగా విజయంతమై.. బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. టీనేజీ వయసులోనే కోటీశ్వరులవుతుంటారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ కి చెందిన యువకుడు అమీర్ కుతుబ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఎన్నో కష్టాలు పడి.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మిలినీయర్ అయ్యాడు కుతుబ్. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు అమీర్ కుతుబ్. ఎన్నో కష్టాలు పడి ఇక్కడ భారత్ లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇక 23 ఏళ్ల వయసులో అందరిలానే అమీర్ కూడా ఉన్నతవిద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి ఓ కళాశాలలో ఎంబీఏ(MBA)లో చేరాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే. దాంతో అక్కడికి వెళ్లిన తర్వాత ఇంటి నుంచి అమీర్‌కు ఆర్థికంగా ఎలాంటి సహకారం లభించలేదు.

దీనికి తోడు మనోడికి ఇంగ్లీష్ సరిగా రాకపోవడం, కొన్ని రోజుల వరకు పార్ట్‌టైం ఉద్యోగం దొరకపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. వాటిని దాటుకుని ఎలాగోలా ఎంబీఏ(MBA) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ వేటలో పడ్డాడు. ఈ క్రమంలో 300కు పైగా కంపెనీలు తిరిగాడు. కానీ, ఎక్కడ మనోడికి జాబ్ దొరకలేదు. దాంతో చేసేదేమిలేక విక్టోరియాలోని అవెలాన్ విమానాశ్రయంలో క్లీనర్‌గా చేరాడు. అక్కడే రెండేళ్లు గడిచిపోయాయి.

ఈ విషయం తెలిసి.. అమీర్ తండ్రి నువ్వు చదివిన చదువు ఏంటి.. చేసే పనేంటి.. ఇండియాకు వచ్చెయ్ అంటూ ఫోన్ల మీద ఫోన్లు చేసేవాడు. కానీ, అమీర్ ఆ మాటలకు కుంగిపోలేదు. తన రూటే సపరేటు అన్నట్టు విధంగా కష్టాలకు ఎదురొడ్డి పొరాడాడు. ఈ క్రమంలో అమీర్‌కు ఐసీటీ గీలాంగ్ అనే టెక్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇక్కడే అమీర్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. అమీర్ తన ప్రతిభతో కంపెనీలో చేరిన చాలా తక్కువ వ్యవధిలోనే ఆపరేషన్ మేనేజర్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. దాంతో కంపెనీ జనరల్ మేనేజర్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అలా రెండేళ్లు పనిచేసిన తర్వాత జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయింది. దాంతో అమీర్‌కు కంపెనీ తాత్కాలిక జీఎం పోస్టు లభించింది.

ఇది కూడా చదవండి : నిమ్మగడ్డితో అనూహ్య లాభాలు.. రూ.20వేల పెట్టుబడితో.. రూ.4 లక్షల ఆదాయం

ఇంకేముంది అమీర్ కి హోదాతో పాటు ఆదాయం కూడా పెరిగింది. జీఎం పోస్టుతో అమీర్ ఆదాయం ఏకంగా 300 శాతం పెరిగిపోయింది. అంతే.. అక్కడి నుంచి మనోడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ, అమీర్‌కు మొదటి నుంచి సొంతంగా ఏదైనా కంపెనీ పెట్టాలనే ఆలోచన ఉండేది. దాన్ని అమలులో పెట్టాడు. 2014లో కేవలం 2వేల డాలర్ల(రూ.1.58లక్షలు)తో 'ఎంటర్‌ప్రైజ్ మంకీ ప్రొప్రైటర్ లిమిటెడ్' అనే ఓ టెక్ కంపెనీని నెలకొల్పాడు.

ఆ కంపెనీ అంచెలఅంచెలుగా ఎదిగింది. ఇవాళ ఈ సంస్థలో 100 మంది వరకు ఉద్యోగులు ఉండగా... కంపెనీ టర్నోవర్ వచ్చి 2మిలియన్ డాలర్లు(రూ.15.81కోట్లు). ఇలా ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్లి.. ఇవాళ సక్సెస్ ఫుల్ టెకీ వ్యవస్థాపకుడిగా అమీర్ కుతుబ్ కొనసాగుతున్నాడంటే దాని వెనుక అతడి అలుపెరుగని కృషి, పట్టుదలే కారణం. ఇప్పుడు అమీర్.. ఎంతో మంది స్పూర్తిదాయకంగా నిలిచాడు.

First published:

Tags: Australia, Business, Success story, Uttarpradesh

ఉత్తమ కథలు