నెలకు రూ.40 వేలు పక్కా.. రేపటి నుంచి ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్

ఖర్చులు తీసివేస్తే ఏడాదికి రూ.4.30 లక్షల నికర లాభం వస్తుంది. అంటే నెలకు దాదాపు 36వేలు ఆదాయం వస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటే నెలకు రూ.40-50వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు.

news18-telugu
Updated: October 1, 2019, 3:10 PM IST
నెలకు రూ.40 వేలు పక్కా.. రేపటి నుంచి ఈ వ్యాపారానికి ఫుల్ డిమాండ్
Ajanta Pharma స్టాక్ ధర 5,818 శాతం వృద్ధి నమోదు చేసింది. పదేళ్ల క్రితం రూ.25.04 ఉన్న షేర్ ధర ప్రస్తుతం రూ. 1481.85కు పెరిగింది. ఈ సంస్థలో పదేళ్ల క్రితం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ డబ్బు రూ.1.16 కోట్లు అయ్యి ఉండేది.
  • Share this:
దేశంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. ఒకసారి మాత్రమే వాడగలిగే (వన్ టైమ్ యూస్) ప్లాస్టిక్‌ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి నిషేధించబోతోంది. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు. వాడకూడదు. నిల్వ చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ కోసమే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం చర్యలతో ప్లాస్టిక్ వ్యాపారాలు పడిపోనున్నాయి. అదే స్థానంలో కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని పెట్టాలని మీరు భావిస్తుంటే.. ఇదే మంచి సమయం..!

జ్యూట్ బ్యాగ్


ప్లాస్టిక్‌పై బ్యాన్ విధిస్తున్న నేపథ్యంలో జనపనార సంచుల తయారీ యూనిట్‌ని ఏర్పాటుచేస్తే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశముంది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం పూర్తిగా తగ్గనున్న నేపథ్యంలో జ్యూట్ బ్యాగ్‌లకు డిమాండ్ పెరగనుంది. ఈ నేపథ్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ యూనిట్ స్థాపిస్తే లాభదాయకంగా ఉంటుంది.

టెక్స్‌‌టైల్ మినిస్ట్రీ పరిధిలోని హ్యాండిక్రాఫ్ట్ డివిజన్ ప్రకారం.. జ్యూట్ బ్యాగ్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు 5 కుట్టు యంత్రాలు అవసరం అవుతాయి. వీటికి దాదాపు రూ.90 వేలు ఖర్చవుతుంది. మరో రూ.లక్షా 4వేలు వర్కింగ్ క్యాపిటల్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులకు మరో 58 వేలు అవసరం అవుతాయి. మొత్తంగా జనపనార సంచుల తయారీ యూనిట్‌కు రూ.2.52 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో 65శాతం ముద్ర లోన్, మరో 25 శాతం NCFD (నేషనల్ సెంటర్ ఫర్ జూట్ డైవర్సిఫికేషన్) కింద అందుతుంది. ఇక మీరు రూ. 25వేలు సమకూర్చుకుంటే సరిపోతుంది.

జనపనార సంచులకు తయారీకి ముడి సరుకు, సిబ్బంది జీతాలు, అద్దె, బ్యాంకు వడ్డీకి కలిపి ఏడాదికి 27.95 లక్షలు ఖర్చవుతాయి. ఇక జ్యూట్ బ్యాగ్‌ల అమ్మకం ద్వారా 32.35 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఖర్చులు తీసివేస్తే ఏడాదికి రూ.4.30 లక్షల నికర లాభం వస్తుంది. అంటే నెలకు దాదాపు 36వేలు ఆదాయం వస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటే నెలకు రూ.40-50వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు.
First published: October 1, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading