Fridge Price | కొత్త ఏడాది వస్తూ వస్తూనే కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కొత్త రూల్స్ (Rules) తెచ్చింది. స్టార్ రేటింగ్‌లో మార్పులు చేసింది. జనవరి 1 (January) నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. బీఈఈ లేబులింగ్ రూల్స్ అమలులోకి రావడంతో రిఫ్రిజిరేటర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
కొత్త రూల్స్ వల్ల ఫ్రిజ్ ధరలు 5 శాతం మేర పైకి చేరొచ్చు. గోద్రేజ్ అప్లయెన్సెస్, హయర్, పానాసోనిక్ వంటి కంపెనీలు ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. మోడల్ ప్రాతిపదికన ఫ్రిజ్ ధరలు 2 శాతం నుంచి 5 శాతం వరకు పెరగనున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేయాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుందని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఫ్రిజ్ కొనే యోచనలో ఉంటే ఇప్పుడే కొనేసుకోవడం ఉత్తమం. రానున్న కాలంలో రేట్లు పైకి కదలొచ్చు.
సామాన్యులకు భారీ షాక్.. ఈ స్కీమ్స్‌లో చేరిన వారికి కేంద్రం ఝలక్!
ఫ్రిజ్ ఎఫిషియెన్సీ ఆధారంగా దానికి బీఈఈ స్టార్ రేటింగ్ ఇస్తారు. 1 నుంచి 5 వరకు ఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. విద్యుత్‌ను పొదుపుగా వాడే ఫ్రిజ్‌కు అయితే 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అంటే ఇలాంటి ప్రొడక్టులు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. అదే ఒక స్టార్ ఫ్రిజ్‌లు అయితే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందని చెప్పుకోవచ్చు.
గడువు దాటితే ఫసక్కే.. 2023లో గుర్తించుకోవాల్సిన 17 డెడ్‌లైన్స్ ఇవే!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రూల్స్ తీసుకురావడంతో స్టార్ రేటింగ్‌ను మరింత పటిష్టం చేసింది. ఇప్పుడు కంపెనీలు ఫ్రిజర్స్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్లకు విడి విడిగా రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రోస్ట్ ఫ్రీ మోడల్స్‌కు ఇది వర్తిస్తుంది. స్టార్ రేటింగ్‌లో భాగంగా రెండు యూనిట్లకు లేబులింగ్ ఇవ్వాల్సి ఉంటుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. దీని వల్ల ధరలు పెరగొచ్చని, రేట్ల పెంపు 2 నుంచి 3 శాతం వరకు ఉండొచ్చని తెలిపారు.
అంతేకాకుడా కంపెనీలు ఇకపై నికర సామర్థ్యాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఇదివరకు స్థూల సామర్ధ్యం తెలియజేసేవారు. దీని వల్ల వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ మాట్లాడుతూ.. బీఈఈ రూల్స్ సవరణ కారణంగా కంప్రెసర్స్‌ను రీఇన్‌స్టాల్ చేయాల్సి వస్తుందన్నారు. దీని వల్ల ధరలు 2 నుంచి 4 శాతం పెరగొచ్చన్నారు. ఇంకా పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజియోరి మాట్లాడుతూ.. బీఈఈ కొత్త రూల్స్ వల్ల ధరలు 5 శాతం పైకి చేరొచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, New rules, Price Hike