Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా

ఎవరైనా రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. మీరు వెళ్లిన రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సర్వీస్ ఉందంటే మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ కనెక్ట్ చేయొచ్చు.

news18-telugu
Updated: November 21, 2019, 11:55 AM IST
Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా
Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తరచూ రైళ్లల్లో ప్రయాణించేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రైల్వే జోన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించిన రెండో జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేకు ఘనత దక్కింది. భారతీయ రైల్వేకు చెందిన టెలికామ్ కంపెనీ రైల్‌టెల్‌... గూగుల్‌తో కలిసి రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించడం విశేషం. హాల్ట్ స్టేషన్లను మినహాయించి అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత వైఫై అందించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 కేటగిరీలో 5 రైల్వే స్టేషన్లు, ఏ కేటగిరీలో 31, బీ కేటగిరీలో 38, సీ కేటగిరీలో 21, డీ కేటగిరీలో 78, ఈ కేటగిరీలో 387, ఎఫ్ కేటగిరీలో 2, కొత్తగా నిర్మించిన 12 రైల్వే స్టేషన్లున్నాయి. ఈ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది.

ఎవరైనా రైల్వేస్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. మీరు వెళ్లిన రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సర్వీస్ ఉందంటే మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ కనెక్ట్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా వైఫై సెట్టింగ్స్ ఆన్ చేయాలి. మీరు కవరేజీ ఏరియాలో ఉంటే RailWire Wi-Fi SSID కనిపిస్తుంది. మీరు RailWire వైఫై పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే గూగుల్ రైల్వే సర్వీస్ వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. టాప్ రైట్ కార్నర్‌లో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. మీ డివైజ్‌లో RailWire Wi-Fi కనెక్ట్ అవుతుంది. మీరు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరోసారి ఏ రైల్వేస్టేషన్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కేవలం వైఫై ఆన్ చేస్తే చాలు. ఆటోమెటిక్‌గా రైల్‌వైర్ వైఫై కనెక్ట్ అవుతుంది. రైల్‌వైర్ వైఫై హాట్‌స్పాట్‌ను 30 నిమిషాల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఒకరు 350 ఎంబీ డేటా మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోగలరు.

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై

IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవేIndian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: November 21, 2019, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading