Home /News /business /

FREE TRAIN TICKET ON REWARD POINTS AND 10 PER CENT CASHBACK ON AC CLASS TRAIN TICKETS WITH IRCTC SBI CREDIT CARD SS

IRCTC-SBI offer: రైల్ టికెట్ ఉచితం... క్యాష్‌బ్యాక్ 10 శాతం... ఆఫర్ వివరాలివే...

IRCTC-SBI offer: రైల్ టికెట్ ఉచితం... క్యాష్‌బ్యాక్ 10 శాతం... ఆఫర్ వివరాలివే...

IRCTC-SBI offer: రైల్ టికెట్ ఉచితం... క్యాష్‌బ్యాక్ 10 శాతం... ఆఫర్ వివరాలివే...

IIRCTC SBI Credit card offer | ఏసీ క్లాస్‌లో టికెట్ బుక్ చేసిన ప్రతీ సారి 10% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాదు... రివార్డ్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకుని రైలు టికెట్‌ను ఉచితంగా లభిస్తుంది.

    ఏసీ రైలు టికెట్ బుక్ చెస్తే 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాదు... రివార్డ్ పాయింట్స్‌తో ఏసీ రైలు టెకిట్ ఉచితంగా దక్కించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ-ఎస్‌బీఐ సంయుక్తంగా అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ ఆఫర్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ ప్లాటినమ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు తీసుకుంటే వెల్‌కమ్ గిఫ్ట్, వ్యాల్యూబ్యాక్ బెనిఫిట్స్‌తో పాటు ఐఆర్‌సీటీసీతో ప్రయాణిస్తే మరిన్ని బెనిఫిట్స్ లభిస్తాయి. IRCTC-SBI క్రెడిట్ కార్డ్‌ను మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీతో లింక్ చేస్తే లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు ఏసీ క్లాస్‌లో టికెట్ బుక్ చేసిన ప్రతీ సారి 10% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాదు... రివార్డ్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకుని రైలు టికెట్‌ను ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే మీ దగ్గర ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్ ఉంటే ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీతో ఇలా లింక్ చేయండి.

    Read this: IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈజీగా చేయొచ్చు ఇలా

    Indian Railways, IRCTC SBI Credit card offer, IRCTC SBI Credit card, IRCTC SBI Credit card cashback, IRCTC SBI Credit card free ticket, IRCTC SBI Credit card reward points, how to use irctc sbi credit card for ticket booking, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఫ్రీ టికెట్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే
    image: SBI


    ముందుగా మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.
    'Loyalty' ట్యాబ్‌‌లో 'Add Loyalty Account' ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
    తర్వాతి స్క్రీన్‌లో ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పైన ఉన్న 11 అంకెల లాయల్టీ నెంబర్ ఎంటర్ చేయాలి.
    మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి 'Add Loyalty Account' ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.
    మీ లాయల్టీ అకౌంట్ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీతో లింక్ అవుతుంది.

    ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే వన్ టైమ్ యాన్యువల్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత రెన్యువల్ ఫీజు ఏడాదికి రూ.300. ఈ కార్డుతో www.irctc.co.in వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే 1.8 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీల మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు... ఫ్లైట్ టికెట్లు కూడా ఐఆర్‌సీటీసీ ద్వారా తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు.

    Photos: 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3


    ఇవి కూడా చదవండి:

    Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...

    SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

    Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

     
    First published:

    Tags: Indian Railways, Irctc, Railways, Sbi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు