హోమ్ /వార్తలు /బిజినెస్ /

Free Online courses సాయంతో మీ డబ్బుతో సంపద సృష్టించండి...

Free Online courses సాయంతో మీ డబ్బుతో సంపద సృష్టించండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం సరైన అవగాహన ఉండితీరాల్సిందే. లేదంటే నిండా మునగటం ఖాయం. డబ్బు మేనేజ్ చేయటంలో మీరు ఏం చేయాలో చేయకూడదో చెప్పేందుకు ఫ్రీ కోర్సులు చాలానే ఉన్నాయి. అవి కూడా ఆన్లైన్లోనే (CNBC ) అందుబాటులో ఉన్న ఈ కోర్సులు చేస్తే డబ్బును పెట్టుబడిగా పెట్టి, లాభాలు మూటగట్టడంలో ఉన్న మెళకువలు ఇట్టే నేర్చుకోవచ్చు.

ఇంకా చదవండి ...

ఆర్థిక అస్థిరత నేపథ్యంలో డబ్బును తాము సరిగ్గా మేనేజ్ చేస్తున్నామా లేదా అన్న అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. 50 ఏళ్లకే కెరీర్ ముగుస్తుందని losing their job ఎర్లీ రిటైర్మెంట్ తప్పదని కోవిడ్-19 తేల్చేసిన నేపథ్యంలో 5 పదులకు చేరకముందే డబ్బును ఎలా పొదుపుచేసి, ఎక్కువ లాభం ఆర్జించాలనే విషయం గ్లోబల్ గా ట్రెండింగ్ అవుతోంది. తమ సంపాదనను సురక్షితంగా పొదుపు safeguard their savings చేసుకోవటం ఎలా దాన్ని పెట్టుబడులుగా పెట్టి కొత్త సంపదను సృష్టించడం ఎలా అన్నదానిపై వ్యక్తులంతా విపరీతంగా పరిశోధన చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

సంపాదనకు, సంపదకు సంబంధం లేదు !

సంపాదన చాలా తక్కువ, జీతం చాలా తక్కువ అని చాలామంది వాపోతుంటారు. అసలు మీ సంపాదనకు సంపదకు ఏమైత్రం సంబంధం లేదు తెలుసా? మీ చేతుల్లో ఉన్న కాసిన్ని డబ్బులను తెలివిగా పెట్టిబడిగా పెడితే చాలు మీరు కోట్లకు పడగలెత్తవచ్చు. ఇలాంటి రహస్యాలు మీకు ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పరు. ఉద్యోగిగా సంపాదించి, ఏ బ్యాంకులోనో, పోస్టాఫీసులోనో, ఇన్సూరెన్సులోనో, చిట్ ఫండ్స్ లోనో దాచుకోవటం అనే సంప్రదాయ విధానాలు మాత్రమే కాకుండా పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం సరైన అవగాహన ఉండితీరాల్సిందే. లేదంటే నిండా మునగటం ఖాయం. డబ్బు మేనేజ్ చేయటంలో మీరు ఏం చేయాలో చేయకూడదో చెప్పేందుకు ఫ్రీ కోర్సులు చాలానే ఉన్నాయి. అవి కూడా ఆన్లైన్లోనే (CNBC ) అందుబాటులో ఉన్న ఈ కోర్సులు చేస్తే డబ్బును పెట్టుబడిగా పెట్టి, లాభాలు మూటగట్టడంలో ఉన్న మెళకువలు ఇట్టే నేర్చుకోవచ్చు. సంపదను సృష్టించేందుకు పెట్టుబడులు పెట్టండి, లైఫ్ ఇన్సూరెన్స్ ను అర్థం చేసుకోండి, రిటైర్ మెంట్ సేవింగ్స్ కు సరైన దిశానిర్దేశం చేసుకోండి. మరోవిషయం గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్న సమాచారం ప్రొఫెషనల్ ఫైనాన్సియల్ హెల్ప్ కు ప్రత్యామ్నాయం కాదు. ఆర్ధిక విషయాలపై కనీస అవగాహన లేకపోతేమాత్రం ఫైనాన్సియల్ అడ్వైజర్ financial advisorను కలిసి, పెద్ద నిర్ణయాలు తీసుకోండి.

“Future Rich” by Planancial

Planancialప్లానాన్షియల్ అనే ఆన్ లైన్ సోర్స్ లో పర్సనల్ ఫైనాన్స్ కోర్సులున్నాయి. బార్బరా గింటీ (Barbara Ginty) వీటిని రూపొందించారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ , “Future Rich”కు హోస్ట్ గింటీ స్వయంగా పాడ్ కాస్ట్ చేస్తారు. ఇది సిగ్నేచర్ క్లాస్ గా పేరుగాంచింది. ఇది కేవలం 7 రోజుల కోర్సు మాత్రే. 7 నిమిషాల వీడియోలకు జతగా అతిముఖ్యమైన పాయింట్లు, వ్యూహాల కోసం ఒక వర్క్ బుక్ కూడా ఉంటుంది. CFP కాకముందు ఆమె Wall Streetలో కెరీర్ ప్రారంభించారు. మీకు నచ్చినప్పుడు ఈ కోర్స్ చేస్తూ, మధ్యలో ఆపేయవచ్చు, మళ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు పూర్తి చేసే సౌలభ్యం ఇందులో ఉంది.

“Introduction to Life Insurance and Retirement Savings” by Alison

ఇక ఈ కోర్సు ప్రత్యేకత మీకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేరులోనే ఉంది ఇది జీవిత బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించినonline course కోర్సు. ఎడ్యుకేషన్ కంపెనీ అయిన Alison లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్న వివిధ పాలసీలు, ప్లాన్లు, వాటితో ఒనగూరే దీర్ఘకాలిక ప్రయోజనాలను వివరిస్తుంది. సంప్రదాయ జీవిత బీమాతో పన్ను ప్రయోజనాలు వంటి లోతుపాతులు వీడియో మాడ్యూల్స్ లో వివరిస్తారు. వివిధ రకాల రిటైర్మెంట్ ఫండ్స్ ను ఇందులో సవివరంగా చెబుతారు. 6,000 మందికిపై విద్యార్థులు ఇప్పటికే ఈ కోర్సులో చేరారు. ఇది ఉచిత కోర్సు, పైగా త్వరగా పూర్తి చేయవచ్చు. కేవలం గంట నుంచి 2 గంటల్లోగా ఈ కోర్సును పూర్తిచేసేయ్యవచ్చు.

“Money Skill” by MRUniversity

పెట్టుబడులు పెట్టే ధైర్యం మీకు లేదనుకోండి, అసలు పెట్టుబడులు ఎప్పుడు, ఏ రూపంలో పెట్టాలనే బేసిక్స్ పై ఎన్నో సందేహాలున్నా ఈ కోర్సు ద్వారా అవి పటాపంచలవుతాయి. వీడియో క్లాసుల రూపంలో “Money Skills” 10 వీడియోలు, ఎక్సర్ సైజులు మీకు స్వయంగా ఎకనామిక్స్ ప్రొఫెసర్లే వివరిస్తారు. ఈ కోర్సులో చేరేముందు మీకు పెట్టుబడులపై కనీస అవగాహన లేకపోయినా ఫర్వాలేదు, ఎందుకంటే ఇది బిగినర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా డిజైన్ చేశారు.

“My Financial Mountain: Understanding Your Path to a Solid Financial Foundation” by Skillshare

“My Financial Mountain” కోర్సు ఆన్ లైన్ లర్నింగ్ ప్లాట్ ఫాం అయిన SkillShareలో అందుబాటులో ఉంది. డబ్బును ఎలా మేనేజ్ చేయాలనే విషయం తెలుసుకోవాలనుకున్న వారందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఉన్న ఈ కోర్సు రియలిస్టిక్ అప్రోచ్ తో ఉంటుంది. అప్పులు, బడ్జెట్ వంటి బ్రహ్మపదార్థాలన్నీ మీకు ఈజీగా అర్థమయ్యేలా వివరించేలా కోర్సు ఉంటుంది. కేవలం 13 క్లాసులున్న ఈ కోర్సులో ఒక్కొక్క క్లాసు కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉంటుంది. సర్టిఫైడ్ స్కిల్ షేర్ టీచర్ Julio Lara వీటిని మీకు వివరిస్తారు.

“Introduction to Managing Your Personal Finance Debts” by Alison

అలీసన్స్ “Introduction to Managing Your Personal Finance Debts” కోర్సులో ఆర్థిక ప్రణాళికలపై స్పష్టమైన వివరణ ఉంది. అప్పులు చేయకుండా ఎలా జీవితాన్ని నెట్టుకురావాలనే టిప్స్ కూడా మీకు ఇచ్చే కోర్సు ఇది. క్రెడిట్ కార్డు కంపెనీలతో ఎలా ప్రవర్తించాలి వంటి విషయాలన్నీ మీకు కేవలం గంట నిడివి ఉన్న కోర్సులో వీరు వివరించేస్తారు.

షార్ట్ కట్స్ తప్పవు

ఇవండీ మీ డబ్బును తెలివిగా ఎలా దాచుకోవాలో చెప్పే బెస్ట్ ఆన్ లైన్ ఫ్రీ కోర్సులు. కరోనా మహమ్మారి కారణంగా కేవలం ఎక్కువ సంపాదించటమే కాదు తెలివిగా వాటిని దాచుకునే మార్గాలను మీరు అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక వీటిని పూర్తి చేసి, మదుపు చేయటాన్ని అలవర్చుకోండి.

First published:

Tags: Money making

ఉత్తమ కథలు