Free life Insurance: ఈ బ్యాంకుల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తే ఉచిత బీమా సౌకర్యం.. మరిన్ని వివరాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

చాలా మంది తమ డబ్బును ఎఫ్​డీ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఎఫ్​డీ డిపాజిట్లను పెంచుకునేందుకు అనేక బ్యాంకులు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించడం.

  • Share this:
రిస్క్​ తక్కువ.. వడ్డీ ఎక్కువ వచ్చే పెట్టుబడి ఆప్షన్​ ఏదైనా ఉందంటే అది బ్యాంక్​ ఫిక్స్డ్​ డిపాజిట్​ అనే చెప్పవచ్చు. అందువల్లే, చాలా మంది తమ డబ్బును ఎఫ్​డీ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఎఫ్​డీ డిపాజిట్లను పెంచుకునేందుకు అనేక బ్యాంకులు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించడం. వీటికి కొన్ని షరతులు, పరిమితులు ఉంటాయని గుర్తించుకోవాలి. ఉదాహరణకు డీసీబీ బ్యాంకు సురక్షా ఎఫ్​డీని తీసుకుంటే, మీకు ఉచితంగా జీవిత బీమా పాలసీ కూడా లభిస్తుంది. జీవిత బీమా పాలసీ కోసం ఈ బ్యాంక్​ ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకు అధికారిక వెబ్​సైట్​లో ఉన్న వివరాల ప్రకారం 18 నుండి 54 సంవత్సరాల మధ్య వయస్సు వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 55 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వారికి ఈ ఎఫ్​డీ తెరిచేందుకు అనుమతి లేదు.
Amazon Prime: ప్రైమ్​ యూజర్స్​కు గట్టి షాకిచ్చిన అమెజాన్​.. నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్​ తొలగింపు.. వివరాలివే

ఎంత మొత్తానికి ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తారో.. అంత మొత్తానికే ఉచిత జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. అంటే మీరు రూ. 1 లక్ష ఎఫ్​డీ చేస్తే రూ. 1 లక్షకే జీవిత బీమా కవరేజీ లభిస్తుంది.  ఒకవేళ మీరు రూ. 50 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తానికి ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసినా సరే.. మీకు రూ .50 లక్షల వరకే ఉచిత జీమా బీమా సౌకర్యం లభిస్తుంది. మూడేళ్ల కాలవ్యవధి ఉన్న సురక్షా ఎఫ్​ఢీలపై 6.75 శాతం వడ్డీ రేటును డీసీబీ బ్యాంక్​ అందిస్తుంది. వ్యక్తి వయసు, ఫిక్స్​ డిపాజిట్​ కాలవ్యవధిని బట్టి కొన్ని షరతులు వర్తిస్తాయి.

డీసీబీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో..
ఇక, మరో ప్రైవేట్​ దిగ్గజ బ్యాంకు ఐసిఐసిఐ రూ.3 లక్షల జీవిత బీమా కవరేజ్​ను అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్​సైట్ ప్రకారం, రూ.3 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి ఫిక్స్​డ్ చేసిన ఖాతాదారులకు ఏడాది కాలపరిమితితో 3 లక్షల ఉచిత జీవిత బీమా అందిస్తుంది. అయితే, వారు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి ఉండాలి. ఖాతాదారులు18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో బ్యాంకు ఈ గ్రూప్ కవరేజిని అందిస్తుంది. అయితే, ముందస్తు విత్​డ్రాలకు ఉచిత జీవిత బీమా వర్తించదు. ఉమ్మడి ఖాతాల విషయంలో మొదటి డిపాజిట్​​ దారునికి మాత్రమే రెండు బ్యాంకులు బీమాను వర్తింపచేస్తున్నాయి. అయితే, ఉచిత జీవిత బీమా వస్తుందన్న ఆశతో ఎఫ్​డీలు చేయకూడదని గుర్తించుకోండి. మీ ఎఫ్​పై వచ్చే వడ్డీ, ఇతర షరతులను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలి.
Published by:Nikhil Kumar S
First published: