హోమ్ /వార్తలు /బిజినెస్ /

Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు అదిరే శుభవార్త, ఉచితంగా..

Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు అదిరే శుభవార్త, ఉచితంగా..

Swiggy: స్విగ్గీ శుభవార్త.. ఉద్యోగులకు అదిరే శుభవార్త.. ఉచితంగా..

Swiggy: స్విగ్గీ శుభవార్త.. ఉద్యోగులకు అదిరే శుభవార్త.. ఉచితంగా..

Swiggy Ambulance Services | స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగుల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులు అందుబాాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ ఘటన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయ తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Swiggy News: దేశంలోనే అగ్రగామి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో దారుణం జరిగింది. హైదరాబాద్ లోని స్విగ్గీ ఉద్యోగి కుక్క భారి నుంచి తప్పించుకునే క్రమంలో మూడవ అంతస్తు నుంచి దూకి మరణించాడు. అయితే ఆ యువకుడికి ఎటువంటి పరిహారం అందించలేదని తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ విమర్శించింది. స్విగ్గీ (Swiggy) ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను, అయితే ఉద్యోగులకు ఉచిత చికిత్స అందించడంపై ప్రాథమికంగా దృష్టి పెట్టాలని TGPWU ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. చాలా మంది స్విగ్గీ ఉద్యోగుల (Employees) వద్ద చికిత్స కోసం డబ్బు లేదని ఆయన గుర్తుచేశారు.

కుక్క నుండి తప్పించుకోవడానికి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మూడవ అంతస్తు నుండి దూకి మరణించిన సంఘటనను షేక్ సలావుద్దీన్ గుర్తుచేశారు. డ్యూటీలో ఉండగా చనిపోయినా స్విగ్గీ వారి ఉద్యోగికి ఎలాంటి సాయం చేయలేదని ఆయన అన్నారు. 23 ఏళ్ల యువకుడు ఆర్డర్ డెలివరీ చేసేందుకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అతను ఫ్లాట్ తలుపు తట్టినప్పుడు కస్టమర్ పెంపుడు కుక్క అతనిపైకి దూకింది. కుక్క నుండి తప్పించుకోవడానికి మూడవ అంతస్తు నుండి డెలివరీ బాయ్ దూకాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తరవాత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

రేసు గుర్రం.. అందరి కన్ను ఈ స్టాక్ పైనే, డబ్బులు పెడితే కాసుల వర్షం?

ఈ ఘటన తరవాత స్విగ్గీ జనవరి 16 నుంచి అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, వారిపై ఆధారపడిన వారందరికీ తక్షణ, ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు అంబులెన్స్ సేవల కోసం 1800 267 4242 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయవచ్చు. కాల్ చేసే పరిస్థితుల్లో లేకుంటే వారి మొబైల్ లోని యాప్ లో SOS బటన్‌ను నొక్కాలని స్విగ్గీ సూచించింది.

ఎస్‌బీఐ కస్టమరా? నెలకు రూ.700 కడితే చాలు.. ఈ స్మార్ట్ టీవీ మీ సొంతం!

monwyబెంగుళూరు, ఢిల్లీ , హైదరాబాద్, ముంబై, పూణే, కోల్‌కతా నగరాల్లో స్విగ్గీ ముందుగా ఈ సేవలను ప్రారంభించింది. స్విగ్గీ అందించిన బీమా పరిధిలో ఉన్న యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లందరికీ , వారిపై ఆధారపడిన వారికి ఈ సేవలు ఉచితం. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ బీమా పరిధిలోకి రాని కుటుంబ సభ్యుల కోసం అంబులెన్స్ సేవను సబ్సిడీ ధరతో పొందవచ్చని స్విగ్గీ ఆపరేషన్స్ హెడ్

మిహిర్ రాజేష్ షా తెలిపారు.

మేము ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ఉత్పత్తులు, విధానాలలో పెట్టుబడులు పెడుతున్నామని రాజేష్ షా అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ, మా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా లక్షలాది డెలివరీలు సజావుగా జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితులు అనుకోకుండా వచ్చి పడతాయి. అలాంటి సమయంలో స్విగ్గీ ఉద్యోగులకు అంబులెన్సులు ఉపయోగపడతాయని ఆపరేషన్స్ హెడ్ మిహిర్ రాజేష్ షా తెలిపారు.

First published:

Tags: Free ambulance, Money, Swiggy

ఉత్తమ కథలు