Home /News /business /

FRAUDS AT SCHEDULED COMMERCIAL BANKS JUMP 26 IN THREE YEARS GOVERNMENT DATA

మూడేళ్లలో కమర్షియల్ బ్యాంకుల్లో 26% పెరిగిన మోసాలు

మూడేళ్లలో కమర్షియల్ బ్యాంకుల్లో 26% పెరిగిన మోసాలు

మూడేళ్లలో కమర్షియల్ బ్యాంకుల్లో 26% పెరిగిన మోసాలు

మూడేళ్లలో బ్యాంకింగ్ మోసాల్లో రుణాలకు సంబంధించినవి రూ.69,755 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ.14,000 కోట్లతో నీరవ్ మోదీ-మేహుల్ చోక్సీ స్కామ్ అతిపెద్దది. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే నగల వ్యాపారులైన నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేశారు.

ఇంకా చదవండి ...
    కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా బ్యాంకుల్లో మోసాలు తగ్గట్లేదు. మూడేళ్లలో మోసాలు పెరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కమర్షియల్ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4,693 కేసులు నమోదైతే, 2016-17లో 5,076 కేసులు, 2017-18లో 5,917 కేసులు నమోదయ్యాయి. అంటే మోసాలు ఏటేటా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చూస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,789 కేసులు నమోదైతే, 2016-17లో 2,718 కేసులు, 2017-18లో 2,885 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 21న లోక్‌సభకు సమర్పించిన నివేదికలో బయటపెట్టిన లెక్కలివి.

    మూడేళ్లలో బ్యాంకింగ్ మోసాల్లో రుణాలకు సంబంధించినవి రూ.69,755 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ.14,000 కోట్లతో నీరవ్ మోదీ-మేహుల్ చోక్సీ స్కామ్ అతిపెద్దది. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే నగల వ్యాపారులైన నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేశారు. దేశంలోనే అతిపెద్ద లోన్‌ ఫ్రాడ్‌లో ముంబై పీఎన్‌బీ బ్రాంచ్‌కు చెందిన ఇద్దరు జూనియర్ అధికారుల హస్తం ఉందంటే పీఎన్‌బీలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీ కుంభకోణాలను తగిన సమయంలో గుర్తించి దర్యాప్తు చేయడం ద్వారా మోసాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. రూ.50 కోట్లు దాటిన లోన్ అకౌంట్లను నాన్ పర్ఫామింగ్ అసెట్స్‌గా పరిగణిస్తున్నాయి బ్యాంకులు. వాటిలో మోసాలు జరిగే అవకాశాలు ఉండొచ్చన్న కోణాల్లో విచారణ జరిపి సమీక్ష కోసం బ్యాంక్స్ కమిటీకి నివేదికలు ఇస్తున్నాయి. అంతేకాదు... మోసాలు తగ్గించడానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు.

    ఇవి కూడా చదవండి:

    డీటీహెచ్, కేబుల్‌లో కొత్త ఛానెల్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి?

    డీటీహెచ్, కేబుల్ కొత్త ప్యాకేజీల ధరల వివరాలు ఇవే...

    రూ.900 లోపే రియల్‌మీ 2 ప్రో, రెడ్‌మీ నోట్ 6 ప్రో... ఎలా కొనాలో తెలుసుకోండి

    మరో ఛాన్స్: ఓటరు జాబితాలో పేరు లేదా? ఇలా దరఖాస్తు చేసుకోండి

    గూగుల్ కొత్త యాప్ 'నైబర్లీ' ట్రై చేశారా?

    పబ్‌జీ మొబైల్ గేమ్‌ని బ్యాన్ చేశారా? అసలు నిజం ఏంటీ?

     
    First published:

    Tags: Bank, PNB Scam

    తదుపరి వార్తలు