ఇండియాకి కలిసొస్తున్న కాలం, తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు

ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జాతీయ, అంతర్జాతీయ అంశాల ప్రభావం వాటిపై పడుతూనే ఉంటుంది. ఐతే, చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండియా పరిస్థితి మెరుగవుతోంది. విదేశీ ఇన్వెస్టర్లకు ఇండియాపై నమ్మకం పెరుగుతోంది. ఆర్థిక అంశాల్లో పాలకులు, రిజర్వ్ బ్యాంక్ మేలైన నిర్ణయాలు తీసుకుంటే మరిన్ని శుభ సంకేతాల్ని చూడొచ్చు.

news18-telugu
Updated: November 26, 2018, 3:36 PM IST
ఇండియాకి కలిసొస్తున్న కాలం, తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నవంబర్‌లో ఇండియన్ మార్కెట్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇప్పటివరకూ రూ.6,310 కోట్లు వచ్చిచేరాయి. అక్టోబర్‌లో భారీగా ఫండ్స్ వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటం, రూపాయి విలువ పెరుగుతుండటంతో మళ్లీ ఇండియన్ మార్కెట్ వైపు చూస్తున్నారు.

అక్టోబర్‌లో రూ.38,900 కోట్లు విదేశాలకు తరలిపోయాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధికం. అంతకుముందు సెప్టెంబర్‌లో ఈక్విటీ, డెట్ కేపిటల్ మార్కెట్ల నుంచీ రూ.21,000 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. జులై, ఆగస్టులో మాత్రం రూ.7,500 కోట్లు మార్కెట్లోకి తిరిగి వచ్చాయి. నవంబర్ 1 నుంచీ 22 వరకూ ఓవర్సీస్ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌లో రూ.923 కోట్లు పెట్టుబడి పెట్టారు. డెట్ మార్కెట్‌లో రూ.5,387 కోట్లు చేర్చారు. మొత్తం పెట్టుబడులు రూ.6,300 కోట్లుగా తేలింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడటం, చమురు ధరలు తగ్గడం భారత్‌కి మేలు చేస్తున్నాయన్న నిపుణులు, ఇండియాను వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా విదేశీ ఇన్వెస్టర్లు భావించేందుకు వీలవుతుందన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియా పెట్టుబడుల వల్ల భారత్‌లో ద్రవ్య వినిమయం ఎక్కువగా జరుగుతుందనీ, మార్కెట్ పరిస్థితి మెరుగవుతుందనీ తెలిపారు.



కొన్నినెలలుగా అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, ఇన్వెస్టర్లలో లేనిపోని భయాలు కల్పించింది. మార్కెట్లు అనిశ్చితికి లోనయ్యాయి. ఫలితంగా అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెగియాయి. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను విత్‌డ్రావైపు నడిపించాయి. సేఫ్ ఆల్టర్నేట్ చూసుకుంటూ, పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

ఇకపై ఎఫ్‌పీఐలు ఇలాగే పెరుగుతాయా అంటే చెప్పలేని పరిస్థితి. చమురు ధరలు, రూపాయి విలువతో పాటూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. చైనా, బ్రెజిల్ దేశాల మార్కెట్లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఇండియాకి గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకూ కేపిటల్ మార్కెట్ల నుంచీ రూ.94,000 కోట్లు తరలిపోయాయి. వీటిలో ఈక్విటీల నుంచీ రూ.41,000 కోట్లు వెళ్లిపోగా, డెట్ మార్కెట్ నుంచీ రూ.53,000 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. నవంబర్ నుంచీ తిరిగి వస్తున్నందున, డిసెంబర్‌లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Loading...
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


సావరిన్ బాండ్స్‌లో పాజిటివ్ సంకేతాలు :
చమురు ధరల తగ్గుదల, సావరిన్ బాండ్ల పెరుగుదలకు కూడా ఊతమిస్తోందని ఐడీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఏడాది కాలంలో అత్యధిక బాండ్లు వచ్చిన క్వార్టర్‌ ఇదేనని వివరించింది. బ్రెంట్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల, ఈ వీకెండ్‌లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంటుందనే సంకేతాలొస్తున్నాయి. ఆర్బీఐ ఇస్తున్న డెట్ కొనుగోళ్ల సపోర్ట్ కూడా ఇన్వెస్టర్లకు కలిసొస్తోందని అసెట్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ పరిణామాలు 2011 నుంచీ వస్తున్న నష్టాల్ని తగ్గించుకోవడానికి వీలవుతుందని వివరించింది.

జూన్‌లో వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్‌బ్యాంక్, వచ్చే వారం మరోసారి రివ్యూ చేయబోతోంది. జులై-సెప్టెంబర్ మధ్య రెండో క్వార్టర్‌లో దేశీయ వృద్ధి రేటు తక్కువగా ఉండటం వల్ల, రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయం కీలకం కాబోతోంది. ఈ నెలలో ఆసియాలోనే అత్యుత్తమ కరెన్సీగా రూపాయి నిలబడింది. ఇదే సమయంలో విదేశాల నుంచీ ఈక్విటీ, డెట్ మార్కెట్లకు నిధులు తరలివచ్చాయి. ఏడు నెలల నష్టాల్ని అధిగమిస్తూ, అక్టోబర్ చివరికి సెన్సెక్స్ ఐదు శాతం బలపడంది.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సావరిన్ బాండ్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకుంటే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు.
First published: November 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...