ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఆ తర్వాత కూడా సౌకర్యవంతంగా జీవితం కొనసాగించడానికి, చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) తీసుకొంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనే వాళ్లు సాధారణంగారెండు విషయాలను ఆశిస్తారు. మొదటిది కుటుంబానికి డబ్బు చెల్లించాలని, రెండోది ఆ డబ్బు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా అందజేయాలని భావిస్తారు. ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి పొందాలంటే టైమ్‌కు ప్రీమియం(Premium) మొత్తం చెల్లించాలి.అదే విధంగా డిస్‌క్లోసర్స్(Disclosures) సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ సక్రమంగానే ఉన్నా ఇతర కారణాలతో కొన్ని సమయాల్లో ఇన్సూరెన్స్ డబ్బు పొందడంలో చిక్కులు ఎదురవుతాయి. అలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులకు ఎదురుకాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది అంటే ఇన్సూరెన్స్ తీసుకొన్న వాళ్లు ఉండరు. కాబట్టి పాలసీకి సంబంధించిన పేపర్లు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు అన్ని జాగ్రత్తగా ఓ చోట పెట్టాలి. డాక్యుమెంట్స్ ఉంచిన వివరాలను మీ ఇన్సూరెన్స్‌లో నామినీగా పేర్కొన్న వారికి తెలియజేయాలి. మీరు ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్(E-Insurance Account) కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంది. ఈ- ఇన్సూరెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి డిజిటల్ ఫార్మాట్‌లో అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరచండి. ఆ అకౌంట్ వివరాలను మీ నామినీకి కూడా అందజేయండి. ఈ రెండు పనులు చేయడం ద్వారాఏ సమయంలోనైనా డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. మీ నామినీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకొనే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్యుమెంట్స్ అందజేయగలరు.
నామినీకి క్లెయిమ్ ప్రాసెస్ వివరించండి..
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొనే సమయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, చక్కదిద్దడానికి మీ నామినీతో పాటు మీరు ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఉండరు కదా!. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తుల ఏదైనా పొరబాటు చేసి ఉంటే క్లైమ్ చేసుకొనే సమయంలో నామినీ ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందుకే ఇన్సూరెన్స్ చేసే వ్యక్తులు తమ నామినీకి అన్ని వివరాలు తెలియజేయాలి. వారికి అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి క్లైమ్ చేసుకొనే ప్రక్రియ ఎలా ఉంటుందో చూపించాలి. పాలసీ అడ్వైజర్ల ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వారిని మీ నామినీకి పరిచయం చేయండి. వారి కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వండి. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకొనే సమయంలో వారు కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతారు. సులువుగా డబ్బు పొందేలా ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయపడుతారు.
మ్యారీడ్ వుమెన్స్ ప్రాపర్టీ యాక్ట్‌పై అవగాహన అవసరం
ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఎవరికైనా నగదు చెల్లించాల్సి ఉంటే.. నామినీ క్లైమ్ చేసుకొన్న డబ్బును అప్పు ఇచ్చిన వారు చట్టపరంగా పొందే అవకాశం ఉంది. ఎలాంటి లోన్స్ లేని సమయంలోనే నామినీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోగలరు. అదే విధంగా వారసుల మంటూ కుటుంబ సభ్యులు నామినీలుగా ముందుకు వచ్చి గొడవలు కూడా పడవచ్చు. ఇలంటి సందర్భాల్లో పెళ్లి అయిన పురుషులకు ఓ అవకాశం ఉంది. ఇబ్బందికర పరిస్థితులను తప్పించడానికి పురుషులు మ్యారీడ్ వుమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. దీని ద్వారా క్లైమ్ చేసుకొనే అవకాశం వ్యక్తి భార్య లేదా పిల్లలకు మాత్రమే ఉంటుంది.
డబ్బు అందుకొన్న తర్వాత ఎవరికి నిజంగా చెల్లించాలో తెలుసుకొని వారి డబ్బు తిరిగి ఇచ్చే వెసులు బాటు ఉంటుంది.
క్లెయిమ్ చేసుకొనే నగదు ఏ మార్గంలో పొందాలి?
నామినీ ఇన్సూరెన్స్ నగదు తీసుకొనే సమయానికి, వారి బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉంటే సమస్య అవుతుంది. ముందుగానే ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే మేలు. లేదంటే అనుకొనే పరిస్థితుల్లో డబ్బును సక్రమంగా మేనేజ్ చేయలేక నష్టపోయే ప్రమాదం ఉంటుంది. క్లైమ్ చేసుకొన్న నగదును ఏరూపంలో పొందాలి, ఎలా మేనేజ్ చేయాలనే దానిపై స్పష్టత తప్పనిసరి. ఒకేసారి మొత్తం ఇన్సూరెన్స్ డబ్బు తీసుకొనే అవకాశం ఉంది. తీర్చాల్సిన లోన్లు, పెద్ద అవసరాలు ఉండేవారు ఈ మార్గం ఎంచుకోవచ్చు. లేదా ప్రతి నెలా కొంత మొత్తం తిరిగి తీసుకొనే సదుపాయం కూడా ఉంది. అదే విధంగా కొంత మొత్తం క్లైమ్ చేసుకొనే సమయంలో చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని ప్రతి నెలా ఇచ్చేలా కూడా సదుపాయం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Insurance, Life Insurance