Home /News /business /

FORM 16 WHAT IS FORM 16 WHY IS THIS DOCUMENT IMPORTANT IN TERMS OF IT RETURN KNOW FULL DETAILS HERE GH VB

Form 16: ఫారం 16 అంటే ఏంటి..? ఐటీ రిటర్న్ విషయంలో దీనికంత ప్రాధాన్యమెందుకు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫారం 16 అనేది.. ఇన్‌కమ్‌, ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌(TDS), ఇతర సమాచారం గురించి పేర్కొంటూ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్. ఇది ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ను మినహాయించినట్లు, ఉద్యోగి తరపున ప్రభుత్వ అధికారులకు డిపాజిట్ చేసినట్లు ధ్రువీకరిస్తు?

ఇంకా చదవండి ...
ఫారం 16(Form 16) అనేది.. ఇన్‌కమ్‌(Income), ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌(TDS), ఇతర సమాచారం గురించి పేర్కొంటూ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసే సర్టిఫికేట్(Certificate). ఇది ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ను మినహాయించినట్లు, ఉద్యోగి తరపున ప్రభుత్వ అధికారులకు డిపాజిట్(Deposit) చేసినట్లు ధ్రువీకరిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ఇటీవల ఫారం 16లో ఉద్యోగులకు జారీ చేసిన వార్షిక జీతం TDS సర్టిఫికేట్‌లో సవరణలు చేసింది. అయితే కొత్త మార్పుల గురించి తెలుసుకునే ముందు.. ఫారం 16(Form 16) గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫారం 16 అంటే ఏంటి?
ఫారం 16లో ఒకరు తమ ఆదాయపన్ను రిటర్న్‌ను సిద్ధం చేయడానికి, ఫైల్ చేయడానికి అవసరమైన సమాచారం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఆదాయం, పనిచేస్తున్న సంస్థ తీసివేసిన TDS మొత్తాన్ని చూపుతుంది. ఫారం 16లో పార్ట్ ఎ, పార్ట్ బి అనే రెండు భాగాలు ఉన్నాయి.



ఫారం 16లోని పార్ట్ A (ఫారం 16A)
ఫారమ్ 16A త్రైమాసికంలో తీసివేసిన, డిపాజిట్ చేసిన TDS వివరాలు, పనిచేస్తున్న సంస్థ PAN, TAN వివరాలు, ఇతర సమాచారాన్ని అందిస్తుంది. యజమాని TRACES పోర్టల్ ద్వారా ఫారం 16లో ఈ భాగాన్ని రూపొందించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారే ఉద్యోగులు, ప్రతి సంస్థ నుంచి విడిగా ఉద్యోగ కాలానికి సంబంధించి ఫారం 16 తీసుకోవాలి.

 16 భాగం A భాగాలు:
సంస్థ పేరు, చిరునామా
TAN, యజమాని PAN
ఉద్యోగి పాన్
త్రైమాసికానికి తగ్గింపు, డిపాజిట్ చేసిన పన్ను(సంస్థ ధ్రువీకరించిన వివరాలు)

Samsung Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,750 డిస్కౌంట్... 6,000mah బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే మరెన్నో ప్రత్యేకతలు

ఫారం 16లోని పార్ట్ B (ఫారం 16B)
ఫారం 16 పార్ట్ B అనేది పార్ట్ Aకి అనుబంధం. ఇది సంస్థ తమ ఉద్యోగుల కోసం సిద్ధం చేస్తుంది. ఇది ఆదాయపన్ను చట్టంలోని చాప్టర్ VI-A కింద ఆమోదం పొందిన జీతం, డిడక్షన్స్‌ను పేర్కొంటుంది.

 ఫారం 16లో CBDT సవరణల తర్వాత, కొత్తగా చేర్చిన పార్ట్ Bలోని కొన్ని భాగాలు:

జీతం వివరణాత్మక విభజన
సెక్షన్ 10 కింద మినహాయింపు పొందిన అలవెన్సుల వివరణాత్మక విభజన, అధ్యాయం VI-A కింద తగ్గింపుల వివరాలు

పరిచయం చేసిన కొత్త ఫీల్డ్‌లు:
- TDS అందించే ఉద్యోగి నివేదించిన ఇంటి ఆస్తి నుంచి ఆదాయం (లేదా అనుమతించదగిన నష్టం)
- TDS అందించిన ‘ఇతర వనరుల’ ఆదాయం
- ఇతర సంస్థల నుంచి పొందిన మొత్తం జీతం నివేదించడానికి కొత్త ఫీల్డ్
- ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ప్రామాణిక మినహాయింపు కోసం కొత్త ఫీల్డ్

ITR ఫారం 16 కింద జీతం పొందే వ్యక్తుల అర్హత
- సంస్థల నుంచి అందే మొత్తంపై టీడీఎస్‌ చెల్లిస్తున్న వ్యక్తులు అందరూ అర్హులు.
- ఒకవేళ వ్యక్తి పన్ను మినహాయింపు పొందే కేటగిరీ కిందకు వచ్చినప్పటికీ, వారి సంస్థ పన్ను మినహాయింపులు చేసినట్లయితే, అతను/ఆమె ITR ఫారం16 ను జారీ చేయాలి.

ఫారం 16 ఎందుకు అవసరం?
ఆదాయ పన్ను రిటర్నులను సులభంగా ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరం. యజమాని జీతం నుంచి TDSగా తీసివేసిన డబ్బును అధికారులకు సమర్పించినట్లు ఇది రుజువు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు చేసిన పెట్టుబడి ప్రకటనల ఆధారంగా పన్నుల గణన వివరాలను కూడా అందిస్తుంది.

Aadhaar Card: పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం ఆధార్ ఇవ్వాల్సిందేనా? రూల్స్ తెలుసుకోండి

ఫారం 16ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- ఆదాయపన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ incometaxindia.gov.inను ఓపెన్‌ చేయాలి
- 'ఫారంలు/డౌన్‌లోడ్' విభాగంలోని 'ఆదాయ పన్ను ఫారం' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- PDF లేదా పూరించదగిన ఫారమ్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయాలి
- ఫారం డౌన్‌లోడ్ చేయడానికి ‘PDF’పై క్లిక్ చేయాలి
Published by:Veera Babu
First published:

Tags: Financial, Income tax, ITR, Itr deadline, ITR Filing

తదుపరి వార్తలు