FOREX RESERVES FALL BY 12 BN RBI DATA MARKET TO STEM FALL IN THE RUPEE MK
భారీగా పడిపోయిన విదేశీ మారక దవ్ర్య నిల్వలు...2008 నాటి స్థాయికి పతనం...
ప్రతీకాత్మక చిత్రం
2008 తర్వాత ఒకవారంలో అత్యంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. మార్చి 20న ముగిసిన వారంలో నిల్వలు విదేశీ మారక ద్రవ్యం 11.98 బిలియన్ డాలర్లు తగ్గి 469.909 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులతో విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోయాయి. దీంతో మార్చి 20తో ముగిసిన వారంలో అతిపెద్ద స్థాయిలో పడిపోయాయి. 2008 తర్వాత ఒకవారంలో అత్యంత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. మార్చి 20న ముగిసిన వారంలో నిల్వలు విదేశీ మారక ద్రవ్యం 11.98 బిలియన్ డాలర్లు తగ్గి 469.909 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్ల విక్రయించడంతో పారెక్స్ నిల్వలు భారీ స్థాయిలో పడిపోయినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే డాలర్ మారకంలో రూపాయి విలువ కొత్త జీవితకాల కనిష్టాలను నమోదు చేస్తున్న సమయంలో ఫారెక్స్ డాలర్లను విక్రయించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయం 2008 అక్టోబర్ 24 వారంలో ఫారెక్స్ నిల్వలు అత్యధికంగా ఒకే వారంలో 15బిలియన్ డాలర్లు పడిపోయాయి.మార్చి 13తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు గడిచిన 6 నెలల్లో తొలిసారిగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. మార్చి 13న ముగిసిన వారంలో నిల్వలు 5.346 డిలియన్ డాలర్ల తగ్గి 481.89 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.