Ford Cars | కార్ల తయారీ కంపెనీలు మార్కెట్లోకి ఎన్నో రకాల మోడళ్లను తీసుకువస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని బాగా ప్రజాదరణ పొందుతాయి. మరి కొన్ని మోడళ్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఒక కారు (Car) మాత్రం భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎంతలా అంటే కారు బుకింగ్స్‌ను కంపెనీ ఆపేసింది. ఇంకా ఇప్పటికే కారు బుకింగ్ చేసుకున్న వారు వారి బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంటే రూ.2 లక్షల దాకా ఆఫర్ అందిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? ఆ కంపెనీ పేరు ఫోర్డ్ (Ford) మోటార్. ప్రపంచంలోని టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఫోర్డ్ మోటార్ మార్కెట్లోకి బ్రాన్కో ఎస్యూవీ కారును తీసుకువచ్చింది. దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. చాలా మంది ఈ కారును ముందుగానే బుక్ చేసుకున్నారు.
భారీ బుకింగ్స్‌తో కంపెనీ అవాక్కైంది. వచ్చిన బుకింగ్స్ అన్నింటికీ కార్లను సరఫరా చేయలేమని కంపెనీ పేర్కొంటోంది. అందుకే ఎవరైతే బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంటారో వారికి రూ. 2 లక్షలు అందిస్తోంది. 2500 డాలర్లను వెనక్కి ఇస్తోంది. మీడియా నివేదిక ప్రకారం చూస్తే.. ఫోర్డ్ బ్రాన్కో కారుకు భారీ డిమాండ్ ఉంది. అయితే కంపెనీ విడిభాగాల కొరతతో ఇబ్బంది పడుతోంది. గ్లోబల్‌గా సరఫరా అడ్డంకులను ఎదుర్కొంటోంది. దీని వల్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వచ్చే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు!
ఇప్పటికే బ్రాన్కో కారుకు 2 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కంపెనీ బుకింగ్స్‌ను క్యాన్సల్ చేసుకునే వారికి 2500 డాలర్ల తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొందరికే వర్తిస్తుంది. బ్రాన్కో బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మళ్లీ ఫోర్డ్ కంపెనీకే చెందిన మరో కారును కొంన ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెరివిక్, మస్టంగ్, ఎఫ్ 150 ట్రెమ్మర్ వంటి పలు మోడళ్లను అందిస్తోంది.
ఫ్లైట్ టికెట్లపై భారీ తగ్గింపు.. రూ.1126కే విమానం ఎక్కేయండి!
బ్రాన్కో మల్టీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారులో 2.3 లీటర్ ఎకో బూస్ట్ 4 సిలిండర్ ఇంజిన్, 2.7 లీటర్ ఎకోబూస్ట్ వీ6 ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో 7 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్, 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. బేస్ మోడల్లో 16 ఇంచుల వీల్స్, టాప్ వేరియంట్లో 17 ఇంచుల వీల్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ 2 డోర్స్ ఉన్న కారు ధర రూ. 26 లక్షలుగా ఉంది. అలగే 4 డోర్ వేరియంట్ ధర రూ. 29 లక్షలకు పైగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 60 లక్షల దాకా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Car sales, Cars