కారు కొనాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్.. ఆ కార్ల కొనుగోలుపై రూ.5 లక్షల విలువైన బహుమతులు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మెగా సేల్స్ క్యాంపెయిన్ 'మిడ్నైట్ సర్ప్రైజ్'ను ప్రకటించింది. డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 6 వరకు చేపట్టే ఈ క్యాంపెయిన్ సమయంలో వినియోగదారులు ఏదైనా ఫోర్డ్ కారును బుకింగ్ చేసుకుంటే డిజిటల్ స్క్రాచ్ కార్డును అందుకుంటారని కంపెనీ తెలిపింది.

news18-telugu
Updated: December 4, 2020, 6:02 PM IST
కారు కొనాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్.. ఆ కార్ల కొనుగోలుపై రూ.5 లక్షల విలువైన బహుమతులు
ప్రతీకాత్మక చిత్రం(Photo: Manav Sinha/News18.com)
  • Share this:
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మెగా సేల్స్ క్యాంపెయిన్ 'మిడ్నైట్ సర్ప్రైజ్'ను ప్రకటించింది. డిసెంబర్ 4 నుండి డిసెంబర్ 6 వరకు చేపట్టే ఈ క్యాంపెయిన్ సమయంలో వినియోగదారులు ఏదైనా ఫోర్డ్ కారును బుకింగ్ చేసుకుంటే డిజిటల్ స్క్రాచ్ కార్డును అందుకుంటారని కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా రూ.5 లక్షల వరకు ఖచ్చితమైన బహుమతులతో పాటు ప్రతీ కొనుగోలుపై రూ.5 లక్షల వరకు బహుమతులను అందిస్తోంది. ఫోర్డ్ తయారు చేసే అన్ని కార్ల ఉత్పత్తులు ‘మిడ్నైట్ సర్ప్రైజ్’ క్యాంపెయిన్ పరిధిలోకి వస్తాయి. అనగా ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఆస్పైర్, ఫోర్డ్ ఫ్రీస్టైల్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఎండీవర్‌ వంటి కార్ల కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తించనుంది. మొత్తం మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ క్యాంపెయిన్ సమయంలో ఏదైనా ఫోర్డ్ కారును బుక్ చేసుకునే వినియోగదారులందరికీ డిజిటల్ స్క్రాచ్ కార్డ్ తో పాటు ఖచ్చితమైన బహుమతులు లభిస్తాయి.

మిడ్ నైట్ సర్ పైజ్ క్యాంపెయిన్ సమయంలో చేసిన బుకింగ్‌లపై ఎల్‌ఈడీ టీవీలు, డిష్-వాషర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మైక్రోవేవ్ ఓవెన్‌లు, అత్యాధునిక జనరేషన్ ఐప్యాడ్, ఐఫోన్ 11, బ్రాండెడ్ బైసైకిల్, ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్‌, రూ. 25 విలువ చేసే గిఫ్ట్ కార్డులతో పాటు 3 గ్రాములు, 5 గ్రాముల బంగారు నాణేలు, లక్ష రూపాయల వరకు గోల్డ్ వోచర్ లభిస్తుంది. వీటితో పాటు డిసెంబరులో డెలివరీలను తీసుకునే కస్టమర్లు రూ .5 లక్షల విలువైన బంపర్ బహుమతి పొందడానికి అర్హత పొందుతారు.

బుకింగ్ కొరకు టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్..
"ప్రతీ ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మిడ్ నైట్ సర్ ప్రైజ్ మరోసారి తీసుకొస్తున్నాం. ఫోర్డ కార్ల కొనుగోలుపై కస్టమర్లు ఎక్కువ సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము." అని ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా అన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆటోమైబైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో కొత్త ఫోర్డ్‌ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోరికను కరోనా దెబ్బతీసింది.

మూడు రోజుల ఈ క్యాంపెయిన్ సమయంలో డయల్-ఎ- ఫోర్డ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-419-3000కు లేదా ప్రత్యేక ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ www.booking.india.ford.com ద్వారా వాహనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కస్టమర్ల భద్రత, సౌలభ్యానికి ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. క్యాంపెయిన్ నడుస్తున్న ఈ కాలంలో, దేశవ్యాప్తంగా ఫోర్డ్ డీలర్‌షిప్‌లు ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయి. దీని వలన వినియోగదారులకు టెస్ట్ డ్రైవ్, ఫోర్డ్ బుక్ చేసుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
Published by: Nikhil Kumar S
First published: December 4, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading