అమెరికాకు చెందిన ప్రీమియం కార్ల తయరీ సంస్థ ఫోర్డ్ సంస్థ (American car brand Ford) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత (Latest Telugu News) ఆటోమొబైల్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పింది. అంతే కాకుండా వాహన రంగంలో ఉన్న యూఎస్ సంస్థ ఫోర్డ్.. ఎగుమతుల కోసం భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. చెన్నై, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లోకి ఫోర్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 12 మోడల్స్ విడుదలయ్యాయి. వీటిలో 1999లో విడుదలైన ఫోర్డ్ ఐకాన్‌కు గణనీయమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఫోర్డ్ నుంచి దేశంలో విడుదలైన మొదటి మోడల్ కావడం విశేషం. భారతీయ యువత అభిరుచుల మేరకు నూతన ఫీచర్లతో ఫోర్డ్ ఇక్కడ బలమైన ముద్ర వేయగలిగింది.-
స్టైలిష్, డైనమిక్ లుక్‌తో ఫోర్డ్ వాహనాలు యూజర్లను అట్రాక్ట్ చేయడంలో ముందుంటాయి. ఫోర్డ్ నుంచి విడుదలైన ఎస్కార్ట్, మోండియో, ఫ్యూజన్- ఐకాన్, ఎండీవర్ లేదా ఎకోస్పోర్ట్ కార్లలో అద్భుతమైన ఫీచర్లు అందించినప్పటికీ పెద్దగా విజయవంతం కాలేదు.
అయితే, ఆ తర్వాత విడుదలైన ఫోర్డ్ ఫియస్టా, ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లు మాత్రం గణనీయమైన అమ్మకాలు ప్రదర్శించాయి. భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దారు. అందుకే, ఫీగో ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కారుగా రాణిస్తోంది.
LIC IPO: రికార్డులు తిరగరాస్తున్న ఎల్ఐసీ.. దేశీ క్యాపిటల్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ
ఎంత నష్టం వచ్చిందంటే..
భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.
ఎందుకు వైదొలుగుతోంది?
గత దశాబ్దంలో ఫోర్డ్ సుమారు $ 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా తగ్గడం, ఫోర్డ్ సనంద్ ప్లాంట్ నిర్వహనా ఖర్చులు పెరగడంతో ఇక భారత్ నుంచి వైదొలగాని నిర్ణయించినట్లు ఫోర్డ్ ప్రెసిడెంట్, సీఈఓ జిమ్ ఫార్లే చెప్పారు. ఫోర్డ్ని నిర్ణయం ప్రకారం, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్ ఉత్పత్తి మూసివేస్తుంది. ఇక, 2022 రెండవ త్రైమాసికానికి తమిళనాడు ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయనుంది. దీంతో, 23 సంవత్సరాల తరువాత ఫోర్డ్ ఇండియా కథ ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Auto mobile, Cars, USA